Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP పదవ తరగతి పరీక్షలు-2022: హాల్‌టికెట్‌ ఉంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

 

AP పదవ తరగతి పరీక్షలు-2022: హాల్‌టికెట్‌ ఉంటే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం

సరైన కారణాలుంటే అరగంట ఆలస్యమైనా పరీక్ష కేంద్రంలోకి అనుమతి

పదో తరగతి పరీక్షలకు ప్రత్యేక పరిస్థితుల్లో ఉదయం 10 గంటల వరకు విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని మంత్రి బొత్స ఆదేశించారు. పరీక్షలు ఉదయం 9.30 గంటల నుంచి ప్రారంభం కానుండగా.. విద్యార్థులు ఎవరైనా సహేతుకమైన కారణంతో ఆలస్యంగా వస్తే 10 గంటల వరకు అనుమతించాలని సూచించారు.

హాల్‌టికెట్‌ ఉంటే ఉచిత ప్రయాణం

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు వెళ్లి వచ్చేందుకు వీలుగా ఆర్టీసీ పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో పాస్‌లేకపోయినా ఉచితంగా ప్రయాణించేందుకు అవకాశం కల్పిస్తూ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి పరీక్షలు ఈనెల 27 నుంచి మే 9 వరకు జరగనుండగా.. ఈ సమయంలో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని ఈడీ (ఆపరేషన్స్‌) బ్రహ్మానందరెడ్డి గురువారం అన్ని జిల్లాల అధికారులకు ఆదేశాలు జారీచేశారు. పాస్‌ లేకపోయినా హాల్‌టికెట్‌ ఉంటే ప్రయాణానికి అనుమతించాలని పేర్కొన్నారు. ఈ మేరకు జిల్లాల్లోని విద్యాశాఖ అధికారులను సంప్రదించి, అవసరమైన బస్సులు నడపాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.

Sub: SSC Public Examinations - Operation of Adequate number of buses for the convenience of students appearing for SSC Public Examinations for the year 2022 - issue of instructions- Reg.

CLICK FOR CIRCULAR

===================

DOWNLOAD SSC HALL TICKETS

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags