Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Covaxin and Covieshield Prices Slashed at Private Hospitals – Booster Dose Starts from Apr 10

 

Covaxin and Covieshield Prices Slashed at Private Hospitals – Booster Dose Starts from Apr 10

ప్రికాషన్‌ డోసు పంపిణీ రేపటి (ఏప్రిల్ 10) నుండి ప్రారంభం - కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాల ధరలు భారీగా తగ్గింపు – ధరల వివరాలు ఇవే

దేశంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఆదివారం నుంచి ప్రికాషన్‌ డోసు పంపిణీ ప్రారంభం కానున్న సమయంలో వ్యాక్సిన్‌ తయారీ సంస్థలు సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ ఇండియా, భారత్‌ బయోటెక్‌ కీలక నిర్ణయం తీసుకున్నాయి. కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకా ధరలను భారీగా తగ్గించాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ టీకాల ధరలు రూ.225గా ఉండనున్నట్లు ప్రకటించాయి. 18ఏళ్లు పైబడిన వారు ప్రికాషన్‌ డోసులను ప్రైవేటు కేంద్రాల్లో మాత్రమే తీసుకోవాలని కేంద్రం తెలిపిన నేపథ్యంలో టీకా తయారీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి.

ప్రైవేటు ఆసుపత్రులకు కొవిషీల్డ్‌ టీకా డోసు ధరను రూ.600 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు సీరమ్‌ సీఈఓ అదర్‌ పూనావాలా ట్విటర్‌ వేదికగా వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వంతో చర్చించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పూనావాలా తెలిపారు. అటు భారత్‌ బయోటెక్‌ కూడా ఇదే విషయాన్ని వెల్లడించింది. ప్రైవేటు ఆసుపత్రులకు కొవాగ్జిన్‌ టీకా డోసు ధరను రూ.1200 నుంచి రూ.225కు తగ్గించాలని నిర్ణయించినట్లు భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ ఎండీ సుచిత్ర ఎల్లా వెల్లడించారు.

సర్వీసు ఛార్జీ గరిష్ఠంగా రూ.150

అయితే ఈ టీకా ధరలకు సర్వీసు ఛార్జీ అదనం. ఈ ఛార్జీలు గరిష్ఠంగా రూ.150 మాత్రమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం అన్ని ప్రైవేటు కేంద్రాలను సూచించింది. దీంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో కొవాగ్జిన్‌, కొవిషీల్డ్‌ టీకా ధరలు గరిష్ఠంగా  రూ.375 (సర్వీసు ఛార్జీలు కలుపుకుని) ఉండనున్నాయి.

దేశంలో కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ ప్రవేశించినట్లు వస్తోన్న వార్తలు కలవరపెడుతోన్న నేపథ్యంలో వైరస్‌ కట్టడికి కేంద్రం నిన్న కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. 18 ఏళ్లు పైబడిన వారందరూ ఏప్రిల్‌ 10 (ఆదివారం) నుంచి ప్రికాషన్‌ డోసు తీసుకోవచ్చని వెల్లడించింది. రెండో డోసు తీసుకుని 9 నెలలు పూర్తయిన వారు ఈ డోసుకు అర్హులని తెలిపింది. అయితే ప్రైవేటు టీకా కేంద్రాల్లో మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందని వెల్లడించింది. 

రిజిస్ట్రేషన్‌ అక్కర్లేదు..

ప్రికాషన్‌ డోసు కోసం ప్రత్యేకంగా మళ్లీ కొత్తగా నమోదు చేయించుకోవాల్సిన అవసరం లేదు. కొవిన్‌ యాప్‌లోకి వెళ్లి ప్రికాషన్ డోసు కోసం అపాయింట్‌మెంట్ బుక్‌ చేసుకుంటే సరిపోతుంది. లేదా నేరుగా ప్రైవేటు కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకోవచ్చు. తొలి రెండు డోసులు ఏ రకం టీకా అయితే తీసుకున్నారో ప్రికాషన్ డోసు కూడా అదే తీసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. అంటే.. తొలి రెండు డోసులు కొవాగ్జిన్‌ తీసుకున్నవారు.. మూడో డోసు కూడా అదే వేయించుకోవాలి. తొలి డోసులు కొవిషీల్డ్‌ తీసుకుంటే.. ప్రికాషన్‌ డోసు కూడా కొవిషీల్డే వేయించుకోవాలి.

COWIN WEBSITE

==================

ఏప్రిల్‌ 10 నుంచి 18ఏళ్లు పైబడిన అందరికీ ప్రికాషన్‌ డోసులు – వివరాలు ఇవే

CLICK HERE

=================

కొవిన్‌ పోర్టల్‌లో మరో కొత్త ఫీచర్‌ - వ్యాక్సినేషన్‌ తేదీని సరిదిద్దుకునే అవకాశం – వివరాలు ఇవే

CLICK HERE

================= 

Previous
Next Post »
0 Komentar

Google Tags