Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NEET-UG 2022: Counselling Schedule Released

 

NEET-UG 2022: Counselling Schedule Released

నీట్ (యూజీ) -  2022: కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల

======================

UPDATE 04-10-2022

నీట్ యూజీ-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల - ఆల్ ఇండియా కోటా తొలి దశ కౌన్సెలింగ్ వివరాలు ఇవే

నీట్ యూజీ-2022 కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) సోమవారం విడుదల చేసింది. ఆల్ ఇండియా కోటా తొలి దశ కౌన్సెలింగ్ ఈ నెల 11న ప్రారంభమై 20వ తేదీ వరకు ఉంటుంది. మరో వైపు డీమ్డ్, సెంట్రల్ ఇనిస్టి ట్యూట్స్ లో 10వ తేదీ నుంచి 20 మధ్య తొలి దశ కౌన్సెలింగ్ ఉండనుంది.

రాష్ట్రాల్లో తొలి దశ కౌన్సెలింగ్ 17వ తేదీ నుంచి 28 వరకు ఉంటుంది. ఆల్ ఇండియా, డీమ్డ్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ రెండో దశ కౌన్సెలింగ్ నవంబర్ 2-10, స్టేట్ కౌన్సెలింగ్ 7-18వ తేదీ మధ్య ఉండనుంది. మాప్-అప్ రౌండ్ ఆల్ ఇండియా, డీమ్డ్, సెంట్రల్ ఇనిస్టిట్యూట్స్ నవంబర్ 23 నుంచి డిసెంబర్ ఒకటో తేదీ మధ్య, రాష్ట్రాల్లో డిసెంబర్ 6 నుంచి 12వ తేదీ మధ్య నిర్వహిస్తారు. నవంబర్ 15 నుంచి తరగతులు ప్రారంభిస్తారు.

COUNSELLING SCHEDULE

WEBSITE

======================

UPDATE 08-09-2022

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

FINAL KEY

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 31-08-2022

CLICK FOR PROVISIONAL KEY

PRESS NOTE

WEBSITE

======================

UPDATE 12-07-2022

పరీక్ష తేదీ: 17-07-2022  

DOWNLOAD HALL TICKET LINK 1

DOWNLOAD HALL TICKET LINK 2

DOWNLOAD HALL TICKET LINK 3

PRESS NOTE ON HALL TICKETS

WEBSITE

======================

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టి‌ఏ) నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)-2022 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు అర్హులైన అభ్యర్థులు నుంచి దరఖాస్తులు కోరుతోంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (యూజీ)-2022

అర్హత: సంబంధిత సబ్జెక్టులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.

వయసు: 17-25 ఏళ్ల మధ్య ఉండాలి. 31.12.2004 తర్వాత జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: ఎంట్రెన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.

పరీక్ష మొత్తం 18 భాషల్లో నిర్వహించనున్నారు.

పరీక్షా విధానం: నీట్ (యూజీ) 2022 పరీక్షలో నాలుగు సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సబ్జెక్టులో రెండు సెక్షన్లు (సెక్షన్ ఏ, సెక్షన్ బీ) ఉంటాయి. ప్రశ్నలు మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటాయి. మొత్తం - 200 ప్రశ్నలకుగాను 3 గంటల 20 నిమిషాలు సమయం ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.1600.

ఆన్లైన్ దరఖాస్తుల ప్రారంభ తేది: 06.04.2022

ఆన్లైన్ దరఖాస్తులకి చివరి తేది: 07.05.2022

పరీక్ష తేది: 17.07.2022

పరీక్ష సమయం: మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5:20 వరకు.

INFORMATION BULLETIN

REGISTER HERE

IMPORTANT DATES

PUBLIC NOTICE 06-04-2022

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags