Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

New Windows 11 Features: Hacker Alert, Voice Commands, And More – Details Here

 

New Windows 11 Features: Hacker Alert, Voice Commands, And MoreDetails Here

 మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 11లో మరిన్ని కొత్త ఫీచర్లు వివరాలు ఇవే

సాఫ్ట్‌వేర్‌ దిగ్గజం మైక్రోసాఫ్ట్‌ కొత్త ఆపరేటింగ్‌ సిస్టమ్‌ (ఓఎస్‌) విండోస్ 11 వాడే యూజర్లకు శుభవార్త చెప్పింది. విండోస్‌ 11 ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో యూజర్ల భద్రతను మరింతగా మెరుగుపరచడానికి, సులువుగా యాక్సెస్‌ చేయడానికి కొన్ని ముఖ్యమైన ఫీచర్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించింది. మరి ఆ ఫీచర్లు ఏంటి? ఎలా పనిచేస్తాయి..? 

హ్యాకర్ల నుంచి రక్షణగా..

విండోస్‌ 11లో హ్యాకర్ల గుట్టును పసిగట్టడానికి మైక్రోసాఫ్ట్‌ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. హ్యాకర్లు చొరబాటుకు మన పీసీలోకి పంపే మాల్‌వేర్‌ డౌన్‌లోడ్‌ కాకుండా నియంత్రించడానికి ‘హ్యాకర్‌ అలర్ట్‌’ అనే ఫీచర్‌ను తీసుకొచ్చింది. యూజర్ల గోప్యత, భద్రత కోసం ప్రవేశపెట్టిన మైక్రోసాఫ్ట్‌ డిఫెండర్‌ స్మార్ట్‌స్క్రీన్‌లో భాగంగానే ఈ కొత్త ఫీచర్‌ పనిచేస్తోంది. హ్యాకర్ల చొరబాటును ముందే గుర్తించి యూజర్లను అలర్ట్‌ చేస్తోంది. 

స్మార్ట్‌ యాప్‌ కంట్రోల్‌..

వర్డ్‌, ఎక్సెల్‌, పవర్‌పాయింట్‌ యాప్స్‌ ప్రత్యేకంగా ఇన్‌స్టాల్‌ చేసుకోకుండా ఆ ఫీచర్లన్నింటినీ ఒకే యాప్‌లో అందిస్తూ.. ఆల్‌ ఇన్‌ వన్‌ అప్లికేషన్‌ను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. వీటితో సహా యూజర్లు అతిగా వాడే ముఖ్యమైన యాప్‌లు మాత్రమే రన్‌ అయ్యేలా చేసి మిగతా యాప్‌లను డిఫాల్ట్‌గా బ్లాక్‌ చేయడానికి ‘స్మార్ట్‌ యాప్‌ కంట్రోల్‌’ ఫీచర్‌ను అందుబాటులోకి తెచ్చింది. 

సిస్టమ్‌-వైడ్‌ లైవ్‌ క్యాప్షన్‌

విండోస్‌ 11ను ప్రతి ఒక్కరు సులువుగా యాక్సెస్‌ చేయడానికి ‘సిస్టమ్‌-వైడ్‌ లైవ్‌ క్యాప్షన్‌’ ఫీచర్‌ను తీసుకువచ్చింది. వీడియో లైవ్‌లో మాట్లాడుతున్నపుడు వినికిడి లోపం ఉన్న వారు మాట్లాడే కంటెంట్‌ను సులభంగా  అర్థం చేసుకోనేలా ఈ ఫీచర్‌ పనిచేస్తోంది. అలాగే భాష నేర్చుకునేవారికి ఇది ఎంతగానో సహాయపడతోంది. 

డిక్టేట్‌ కామండ్స్‌ త్రో వాయిస్‌ యాక్సెస్‌..

ఎవరైనా వాయిస్‌ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే అలాంటి వారికోసం విండోస్‌ 11 ఓ సరికొత్త ఫీచర్‌ను తీసుకువచ్చింది. యూజర్లు పీసీ/ల్యాప్‌ట్యాప్‌ను ఉపయోగించి వాయిస్‌ యాక్సెస్‌  ద్వారా కామెండ్స్‌ నిర్దేశించిలా ఈ ఫీచర్‌ పనిచేస్తోంది. 

క్లౌడ్‌ పవర్‌..

సిస్టమ్‌లోని ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌ను క్లౌడ్ సామర్థ్యాలతో మైక్రోసాఫ్ట్‌ అప్‌డేట్ చేస్తుంది. యూజర్లు తమ పీసీలో డేటా, ఫైల్స్‌ను  సులభంగా కనుగొనడానికి/యాక్సెస్ చేసేలా  కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది.

ఫైల్‌ ఎక్స్‌ప్లోరర్‌లో మరిన్ని ట్యాబ్స్‌..

విండోస్‌ 11 ఓఎస్‌లోని ఫైల్ ఎక్స్‌ప్లోరర్‌లో మరిన్ని ట్యాబ్‌లను కూడా మైక్రోసాఫ్ట్  పరిచయం చేస్తోంది. యూజర్లు ఫైల్స్‌ను పిన్‌ చేసుకోవచ్చు. అలాగే ట్యాబ్స్‌ను క్రియేట్‌ చేసుకునేలా ఈ కొత్త ఫీచర్‌ పనిచేస్తోంది. 

వీడియో మీటింగ్స్‌ కొత్తగా..

వీడియో మీటింగ్స్‌ కోసం ప్రత్యేకంగా కొన్ని కొత్త ఫీచర్లను మైక్రోసాఫ్ట్‌ తీసుకొచ్చింది. వాయిస్‌ క్లారిటీ, వాయిస్‌ ఫోకస్‌, పోర్‌ట్రేట్‌ బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌, ఐ కాంటాక్ట్‌, ఆటోమెటిక్‌ ఫ్రేమింగ్‌ లాంటి ఫీచర్లను పరిచయం చేసింది. 

విండోస్‌ 365తో ఇంటిగ్రేట్‌..

విండోస్‌ 11ను క్లౌడ్‌ ఆధారిత విండోస్‌ 365తో ఇంటిగ్రేట్‌ చేసేలా కృషి చేస్తున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వెల్లడించింది. దీంతో క్లౌడ్‌ పీసీ కాస్త లోకల్‌ పీసీగా మారే అవకాశం ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో పని చేశాక రీసింక్‌ చేసి సిస్టమ్ ఆన్‌లైన్‌లోకి వెళ్లినా యూజర్లు ఎలాంటి డేటాను కోల్పోకుండా ఉండటానికే ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. 

గమనిక: ఈ ఫీచర్లు ఇంకా అందరికీ అందుబాటులోకి రాలేదు. ప్రయోగాత్మకంగా కొంతమంది యూజర్లకే అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలో అందరూ వీటిని పొందవచ్చు.

Previous
Next Post »
0 Komentar

Google Tags