TS DEECET-2022: Notification Released – All
the Details Here
టిఎస్ డీఈఈ సెట్-2022: నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ
డైట్లు,
ప్రైవేట్ ఉపాధ్యాయ శిక్షణ విద్యా సంస్థల్లో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్
కోర్సుల్లో (డీఈఎల్ ఈడీ, డీపీఎస్ఈ) ప్రవేశానికి నిర్వహించే
డీఈఈసెట్-2022 ప్రకటన విడుదలైంది.
టీఎస్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్(టీఎస్ డీఈఈసెట్)-2022:
కోర్సులు: డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్ (డీఈఎల్ ఈడీ), డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్
(డీపీఎస్ఈ)
కాల వ్యవధి: 2
సంవత్సరాలు.
అర్హత: కనీసం 50
శాతం మార్కులతో ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
వయసు: 01.09.2022 నాటికి 17 ఏళ్లు నిండి ఉండాలి. దీనికి గరిష్ఠ వయసు
పరిమితి లేదు.
ఎంపిక: ఉమ్మడి ప్రవేశ పరీక్ష
(కంప్యూటర్ బేస్డ్) ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు: రూ.500 చెల్లించాలి.
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 09.05.2022.
దరఖాస్తుకు చివరి తేది: 30.06.2022.
హాల్ టికెట్ల డౌన్ లోడ్ తేదీ: 15.07.2022 నుంచి.
టీఎస్ డీఈఈసెట్ 2022 పరీక్ష తేది: 23.07.2022
0 Komentar