TS POLYCET-2022: Notification Released –
All the Details Here
టీఎస్ పాలిసెట్-2022: నోటిఫికేషన్ విడుదల – పూర్తి వివరాలు ఇవే
హైదరాబాద్ లోని స్టేట్ బోర్డ్ ఆఫ్
టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రెయినింగ్ తెలంగాణ (ఎన్‌బీటీఈటీ) 2022 విద్యాసంవత్సరానికి పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పాలిసెట్-2022)
నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పదో తరగతి పూర్తి
చేసుకున్న విద్యార్థులకు ఇంజినీరింగ్, నాన్ ఇంజినీరింగ్
డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్
టెస్ట్ (పాలిసెట్-2022):
అందిస్తున్న సంస్థలు: ప్రొఫెసర్
జయశంకర్ తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ (పీజేటీఎన్ఏయూ), పీవీ
నరసింహారావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ (పీవీఎస్ఆర్ టీవీ యూ), ఆర్జీయూకేటీ బాసర, అనుబంధ పాలిటెక్నికల్ కళాశాలలు.
అర్హత: పదో తరగతి/ తత్సమాన
ఉత్తీర్ణత. మార్చి, ఏప్రిల్ 2022లో పదో
తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: పాలిసెట్ కామన్
ఎంట్రన్స్ టెస్ట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా
దరఖాస్తు చేసుకోవాలి.
ముఖ్య మైన తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ
ప్రారంభం: 09.05.2022.
ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తుకు
చివరి తేది: 04.06.2022.
రూ.100 ఆలస్య రుసుంతో
దరఖాస్తుకు చివరి తేది: 05.06.2022.
పరీక్ష తేది (పాలిసెట్-2022):
30.06.2022.
ఫలితాలు: పరీక్ష నిర్వహించిన 12 రోజుల అనంతరం ఫలితాలు వెల్లడిస్తారు.
FOR APPLICATION & PAYMENT DETAILS CLICK THE BELOW
WEBSITE 👇
0 Komentar