Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Anand Mahindra Welcomes Opportunity to Recruit Agniveers

 

Anand Mahindra Welcomes Opportunity to Recruit Agniveers

అగ్నిపథ్ పథకం - సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన అగ్నివీరులకు తమ సంస్థలో పనిచేసే అవకాశం - ఆనంద్ మహీంద్రా

సైనిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన 'అగ్నిపథ్ (Agnipath)' పథకంపై దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఆందోళనలపై ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా (Anand Mahindra) విచారం వ్యక్తం చేశారు. జూన్ 20'అగ్నిపథ్ నిరసనలపై ట్విటర్ వేదికగా స్పందించిన మహీంద్రా.. అగ్నివీరులకు (Agniveers) ఓ ఆఫర్ కూడా ప్రకటించారు. ఈ పథకం కింద సైన్యంలో పనిచేసి రిటైర్ అయిన వారికి తమ సంస్థలో పనిచేసే అవకాశం కల్పిస్తామని తెలిపారు.

అగ్నిపథ్ (Agnipath) పథకంపై జరుగుతోన్న హింసాత్మక ఆందోళనలు విచారకరం. గతేడాది ఈ పథకం గురించి తెలిసినప్పుడు నేను ఒక్కటే చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నా. ఈ పథకంతో అగ్నివీరులు (Agniveers) పొందే క్రమశిక్షణ, నైపుణ్యాలు వారికి మంచి ఉపాధి లభించేలా చేస్తాయి. అటువంటి శిక్షణ పొందిన, సమర్థులైన యువకులను రిక్రూట్ చేసుకునే అవకాశాన్ని మహీంద్రా గ్రూప్ స్వాగతిస్తోంది" అని ఆనంద్ మహీంద్రా ట్విటర్ లో వెల్లడించారు.

అయితే, ఈ ట్వీట్ చేసిన కొద్ది సేపటికే.. అగ్నివీరులకు మహీంద్రా గ్రూప్ ఎలాంటి పోస్ట్ ఇవ్వనుంది? అని ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు ఆనంద్ మహీంద్రా బదులిచ్చారు. “అగ్నివీరులకు కార్పొరేట్ రంగంలో విస్తృత ఉపాధి అవకాశాలున్నాయి. నాయకత్వం, టీం వర్క్ దేహ దారుఢ్యంలో శిక్షణ పొందిన అగ్నివీరులు.. కార్పొరేట్ పరిశ్రమకు వృత్తిపరమైన పరిష్కారాలను అందించగలరు. కార్యకలాపాల నుంచి పాలనా వ్యవహారాలు, సప్లయ్ చైన్ మేనేజ్ మెంట్ ఇలా అన్ని విభాగాల్లోనూ వారికి అవకాశాలుంటాయి” అని మహీంద్రా రాసుకొచ్చారు.

త్రివిధ దళాల్లో సరాసరి వయసును తగ్గించడమే అగ్నిపథ్ ఉద్దేశమని సైనిక వ్యవహారాల విభాగం అదనపు కార్యదర్శి లెఫ్టినెంట్ జనరల్ అనిల్ పురీ స్పష్టంచేశారు. అటు అగ్నివీరులు (Agniveers)గా రిటైర్ అయిన వారికి రక్షణశాఖ, కేంద్ర సాయుధ బలగాల నియామకాల్లోనూ 10 శాతం చొప్పున ప్రాధాన్యం కల్పించేందుకు కేంద్రం అంగీకరించిన విషయం తెలిసిందే.

Previous
Next Post »
0 Komentar

Google Tags