Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP 10th Class Public Exams-2022: Results Released

 

AP 10th Class Public Exams-2022: Results Released

ఏపీ పదవ తరగతి పరీక్షలు-2022: ‘పది’ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు విడుదల   

===================

UPDATE 10-06-2022

CLICK FOR MARKS MEMO

PRESS NOTE ON RESULTS – ENGLISH

PRESS NOTE ON RESULTS - TELUGU

===================

UPDATE 06-06-2022

RESULTS LINK 1

RESULTS LINK 2

RESULTS LINK 3

CLICK FOR SCHOOL WISE RESUTLS

AP BSE WEBSITE

ఏపీ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. మొత్తం 6,15,908 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. వారిలో 4,14,281 మంది (67.26 శాతం ఉత్తీర్ణత) పాసయ్యారని మంత్రి వెల్లడించారు. ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారని చెప్పారు. ఫలితాల్లో ప్రకాశం జిల్లా (78.3 శాతం) ప్రథమ స్థానంలో.. అనంతపురం జిల్లా (49.7 శాతం) చివరి స్థానంలో నిలిచినట్లు బొత్స చెప్పారు.

పదో తరగతి పరీక్షల కోసం మొత్తం 6,22,537 మంది విద్యార్థులు ఫీజు చెల్లించారు. వారిలో బాలికలు 3,02,474 మంది, బాలురు 3,20,063 మంది ఉన్నారు. ఏప్రిల్ 27 నుంచి మే 9 వరకు పరీక్షలు నిర్వహించారు. మే 13 నుంచి ప్రశ్నపత్రాల మూల్యాంకనం చేపట్టారు. రెండేళ్ల తర్వాత మొదటిసారిగా పదో తరగతి పరీక్షలను ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించింది. మొదటిసారిగా విద్యార్థుల మార్కులను ప్రకటిస్తున్నారు. ర్యాంకుల ప్రచారంపై ప్రభుత్వం నిషేధం విధించిన విషయం తెలిసిందే.

జులై 6 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

జులై 6 నుంచి 15వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ ప్రకటించారు. ఈ నెల 13 నుంచి వారికి స్పెషల్ కోచింగ్ క్లాసులు కూడా పెడుతున్నామని తెలిపారు.

సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్ ఇదే

======================

AP 10th Class Results -2022 – Recounting and Reverification Details 👇

CLICK HERE

===================

UPDATE 05-06-2022

ఏపీ పదోతరగతి పరీక్ష ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. మధ్యాహ్నం 12 గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ దేవానంద్ రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఫలితాలను రేపు మధ్యాహ్నం 12 గంటల తర్వాత ఫలితాలను క్రింది వెబ్సైటు లలో చూడొచ్చు.

తొలుత శనివారం ఉదయం 11 గంటలకే ఫలితాలు విడుదల చేస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించారు. కానీ ఆ సమయం దాటిన తర్వాత ఫలితాలను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.

===================

UPDATE 04-06-2022

Update: ఏపీ లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు సోమవారం (జూన్ 06) కి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

===================

పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు శనివారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్‌ విజయవాడలో ఫలితాలు విడుదలచేస్తారు. 2019 తర్వాత కొవిడ్‌ కారణంగా రెండేళ్లు పరీక్షలు జరగలేదు. ఈ ఏడాది మళ్లీ పరీక్షలు నిర్వహించగా 6,21,799 మంది విద్యార్థులు రాశారు. ఈసారి ఫలితాలను గ్రేడ్లకు బదులు మార్కుల రూపంలో ప్రకటించనున్నారు.

విజయవాడలోని ఆర్ అండ్ బి కార్యాలయంలో ఫలితాలు విడుదల చేయనున్నారని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ డి. దేవానందరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

గతంలో మాదిరే ఈసారీ విద్యార్థులకు వచ్చిన మార్కులనే వెల్లడిస్తారు. గ్రేడింగ్‌ పద్ధతిని తీసేశారు. విద్యాశాఖ ర్యాంకులనూ ప్రకటించదు. ఈ నేపథ్యంలో విద్యాసంస్థలు కూడా తమ దగ్గర చదువుకున్న విద్యార్థులకు ఫలానా ర్యాంకులు వచ్చాయని ప్రచారం చేయకూడదని, అలా చేస్తే కనీ సం మూడేళ్ల జైలు శిక్ష పడుతుందని ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags