APRS Backlog Vacancies for 6th,
7th & 8th Classes – Details Here
ఆంధ్రప్రదేశ్
గురుకులాల్లో 2022-23 విద్యా సంవత్సరానికి 6, 7, 8 తరగతులలో బ్యాక్ లాగ్ ఖాళీలలో ప్రవేశ వివరాలు ఇవే
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల సంస్థచే నడుపబడుచున్న పాఠశాలలల్లో 2022-23 విద్యా సంవత్సరానికి గాను 6, 7, 8 తరగతులలో సాధారణ (General) గురుకుల పాఠశాలలలో మరియు మైనారిటీ (Minority) గురుకుల పాఠశాలలల్లో వివిధ రిజర్వేషన్ కేటగిరీలలో లభ్యమగు ఖాళీలను నింపుటకు ఆటోమేటెడ్ రాండమ్ సెలక్షన్ పద్ధతి (లాటరీ పద్ధతి) ద్వారా తేది 05-07-2022 న ఎంపిక చేసి, ఎంపికైన వారికి పాఠశాల కేటాయింపు జరుగును.
I. ప్రవేశానికి అర్హతలు:
1. 6వ తరగతి ప్రవేశం కొరకు 2021-22 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 5 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2010 నుండి 31.08.2012 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2012 మధ్య పుట్టి
ఉండాలి.
2. 7వ తరగతి ప్రవేశం కొరకు 2021-22 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 6 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2009 నుండి 31.08.2011 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC,ST) లకు చెందినవారు 01.09.2007 నుండి 31.08.2011 మధ్య పుట్టి
ఉండాలి.
3. 8వ తరగతి ప్రవేశం కొరకు 2021-22 విద్యా సంవత్సరంలో
ప్రభుత్వ లేక ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 7 వ తరగతి చదివి ఉండాలి. ఓ.సి. మరియు బి.సి.లకు చెందినవారు 01.09.2008 నుండి 31.08.2010 మధ్య పుట్టి
ఉండాలి. యస్.సి. మరియు యస్.టి (SC, ST) లకు చెందినవారు 01.09.2006 నుండి 31.08.2010 మధ్య పుట్టి
ఉండాలి.
4. ఆదాయ పరిమితి: అభ్యర్థి యొక్క తల్లి, తండ్రి/సంరక్షకుల సంవత్సర ఆదాయము (2021-22) రూ.1,00,000/- మించి ఉండరాదు లేదా తెల్లరేషన్ కార్డు కలిగినవారు అర్హులు. సైనికోద్యోగుల పిల్లలకు ఈ నియమం వర్తించదు.
దరఖాస్తు తేదీలు: 15-06-2022 నుండి 30-06-2022 వరకు
0 Komentar