Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

E-Passport to Roll Out this Year – What is it and how will it Works?

 

E-Passport to Roll Out this Year – What is it and how will it Works?

-పాస్‌పోర్ట్ లు: ఎప్పటి నుంచి అందుబాటులోకి – ఈ-పాస్పోర్ట్ అంటే ఏమిటి మరియు ఎలా పని చేస్తాయి?

పాస్పోర్ట్ పొందడం అంత సులభమైన ప్రక్రియేమీ కాదు. పాస్పోర్ట్ కోసం దరఖాస్తు చేసుకుని, పోలీస్ వెరిఫికేషన్ ప్రక్రియలో ఎలాంటి అభ్యంతరాలు లేవని రుజువైతే నేరుగా ఇంటికే వస్తుంది. ఒకవేళ పాస్పోర్ట్ పోగొట్టుకుంటే తిరిగి కొత్తది పొందడం మరో పెద్ద పని. అంతేకాదు.. అందులోని సమాచారం ఇతరుల చేతికి చేరుతుందనేది మరో బాధ. మరోవైపు నకిలీ పాస్పోర్టలు కట్టడి కూడా కేంద్రానికి తలనొప్పి వ్యవహారంగా మారింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ-పాస్పోర్ట్ (E- Passport)లను తీసుకురానుంది. వీటి ద్వారా అంతర్జాతీయ ప్రయాణాలను సులభతరం చేయడంతోపాటు, పాస్పోర్ట్ కలిగిన వ్యక్తుల డేటాకు భద్రత కల్పిచడం, నకిలీ పాస్పోర్ట్ లకు అడ్డుకట్ట వేయొచ్చని కేంద్రం చెబుతోంది.

పాస్పోర్ట్ సేవా ప్రాజెక్ట్ రెండో దశలో భాగంగా గతేడాదే ఈ-పాస్పోర్లు తీసుకొస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. తాజాగా పాస్పోర్ట్ దివస్ ను పురస్కరించుకుని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీలక ప్రకటన చేశారు. "ఈ ఏడాది చివరినాటికి ఈ-పాస్పోర్ట్ లను జారీ చేస్తాం. పాస్పోర్ట్ వ్యవస్థలో సంస్కరణలు తీసుకొచ్చి, పౌరులకు ఉత్తమమైన సేవలు అందించాలని ఉద్దేశంతో ఈ-పాస్పోర్ట్ లను తీసుకొస్తున్నాం” అని మంత్రి తెలిపారు.

ఈ-పాస్పోర్ట్ అంటే ఏమిటి?

నిజానికి ఈ-పాస్పోర్ట్ కొత్త ప్రక్రియ ఏమీ కాదు. ఇప్పటికే 100కు పైగా దేశాలు తమ పౌరులకు ఈ పాస్పోర్ట్ లను జారీ చేస్తున్నాయి. ప్రస్తుతం వినియోగంలో సాధారణ పాస్పోర్ట్ తరహాలోనే ఈ-పాస్పోర్ట్ ను ఉపయోగించవచ్చు. డేటా భద్రత, విదేశాల్లో సులువైన ఇమిగ్రేషన్ ప్రక్రియ కోసం వీటిలో ఎలక్ట్రానిక్ చిప్ ను నిక్షిప్తం చేస్తారు. ఇందులో పాస్పోర్ట్ కలిగిన వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, చిరునామా వంటి వివరాలు ఉంటాయి. ఇది ఒక రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ (RFID) చిప్. దీనికి వెనుకవైపు చిన్న యాంటినా ఉంటుంది. దీనిసాయంతో ఇమిగ్రేషన్ లేదా ఇతరత్రా సమయాల్లో ప్రయాణికుడి వివరాలను వేగంగా వెరిఫై చేయొచ్చు. ఇప్పటికే ఈ-పాస్పోర్ట్ సేవలకు సంబంధించి కేంద్రం ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ ను ఎంపిక చేసింది. ఇందుకోసం భాతర విదేశాంగ శాఖతో కలిస టీసీఎస్ ఒక డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనుంది.

ఈ-పాస్పోర్ట్ జారీ ఎప్పుడు?

తాజాగా కేంద్ర మంత్రి జైశంకర్ చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది చివరి నాటికి ఈ-పాస్పోర్ట్ల జారీ ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఎలక్ట్రానిక్ పాస్పోర్ట్ లు అందుబాటులోకి వచ్చిన తర్వాత సాధారణ పాస్పోర్ట్ కలిగిన వ్యక్తులు ఈ-పాస్పోర్ట్ కు అప్ గ్రేడ్ అవ్వాలా? వద్దా? అన్న దానిపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ-పాస్పోర్ట్ లు చూసేందుకు సాధారణ పాస్పోర్ట్ ల మాదిరే ఉంటాయి. ఈ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎవరైనా కొత్త పాస్పోర్ట్ లేదా పాస్పోర్ట్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే వారికి ఈ-పాస్పోర్ట్ లనే జారీ చేస్తారని సమాచారం.

Previous
Next Post »
0 Komentar

Google Tags