Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Google Play Store: Apps & Games Turns 10 with New Logo

 

Google Play Store: Apps & Games Turns 10 with New Logo

గూగుల్ ప్లే: ప్లే యాప్స్ & గేమ్స్’ కి పదేళ్ళు – అత్యధికంగా డౌన్లోడ్ అయిన యాప్స్ ఇవే

గూగుల్ (Google) 2012లో ప్లేను తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ అవసరాలకు అనుగుణంగా యాప్ లను ఇందులోంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలా పుట్టిన గూగుల్ ప్లేకి (Google Play) నేటితో పదేళ్లు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగం గతిని మార్చిన యాప్స్ అండ్ గేమ్స్ గురించి గూగుల్ తెలిపింది.

ఆ వివరాలు మీ కోసం...

"ఈ పది సంవత్సరాల కాలంలో ఎన్నో యాప్స్ ఎంతో నేర్చుకునేందుకు ఉపయోగపడ్డాయి. చిట్ చాట్ సంభాషణల నుంచి షాపింగ్, ఎంటర్ టైన్ మెంట్, డిజిటల్ పేమెంట్స్ దాకా మన జీవితాల్లో ఎంతో సహాయపడ్డాయి. అంతేకాదు మన మెదడుకు పదును పెట్టేలా ఛాలెంజింగ్ గేమ్స్ ఎన్నో రూపుదిద్దుకున్నాయి. ప్లేలో యాప్స్ అండ్ గేమ్స్ కు పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా అత్యంత ఆదరణ కలిగిన యాప్ ల జాబితాను మీతో పంచుకుంటున్నాం” - ప్లేస్టోర్ లో గూగుల్ టీమ్

ఆండ్రాయిడ్ విడుదలైన తొలినాళ్లలో ఆండ్రాయిడ్ మార్కెట్, గూగుల్ మ్యూజిక్, గూగుల్ ఈబుక్ స్టోర్, గూగుల్ మూవీస్ అని వేర్వేరుగా ఉండేవి. వాటన్నింటిని ప్లే కిందకు తీసుకొస్తూ ఈ యాప్ భాండాగారాన్ని గూగుల్ రూపొందించింది. తాజా సమాచారం ప్రకారం గూగుల్ ప్లేలో ఇప్పటి వరకు నాలుగున్నర లక్షల యాప్లు ఉన్నాయట.

డౌన్లోడ్ వివరాలు: 

• అత్యధిక డౌన్లోడ్ తో సోషల్ మీడియా కేటగిరిలో వాట్సాప్ (WhatsApp), షేర్ చాట్ (Sharechat)లు ఉన్నాయి.

• షాపింగ్ కోసం ఎక్కువ మంది ఫ్లిప్ కార్ట్ (Flipkar'), అమెజాన్ (Amazon) ఉపయోగిస్తున్నారట.

  ఎంటర్ టైన్ మెంట్ జాబితాలో ఎమ్ఎక్స్ ప్లేయర్ (MX Player), డిస్నీ + హాట్ స్టార్ (Disney+ Hotstar), జియో సావన్ (Jio Saavn) ఉన్నాయి.

డిజిటల్ చెల్లింపుల కోసం పేటీఎం (Paytm), ఫోన్ పే (Phonepe) ఎక్కువ మంది ఉపయోగిస్తున్నారట.

కాలర్ ఐడెంటిఫికేషన్ యాప్ ట్రూకాలర్ (Truecaller) కూడా పదేళ్ల కాలంలో ఎక్కువ మంది ఉపయోగిస్తున్న యాప్ల జాబితాలో ఉంది. 

గేమింగ్ యాప్స్

గేమింగ్ యాప్స్ లో క్యాండీ క్రష్ (Candy Crush Saga) ఎక్కువ మంది ఫేవరెట్ గేమ్ గా నిలిచింది. తర్వాత వరసగా క్లాష్ ఆఫ్ క్లాన్స్ (Clash of Clans), సబ్ వే సర్ఫర్స్ (Subway Surfers), 8 బాల్ పూల్ (8 Ball Pool), లార్డ్స్ మొబైల్: టవర్ డిఫెన్స్ (Lords Mobile: Tower Defence), రియల్ క్రికెట్ 20 (Real Cricket 20), కాల్ ఆఫ్ డ్యూటీ: మొబైల్ (Call of Duty: Mobile), బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా (Battlegrounds Mobile India), లూడో కింగ్ (Ludo King), వరల్డ్ క్రికెట్ ఛాంపియన్‌షిప్ 2 (World Cricket Championship 2) ఉన్నాయి.

Previous
Next Post »
0 Komentar

Google Tags