Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

NASA’s New Space Telescope Reveals Deepest Look of The Cosmos Ever Captured

 

NASA’s New Space Telescope Reveals Deepest Look of The Cosmos Ever Captured

ఇప్పటిదాకా చూడని అతి సుదూరమైన చిత్రమిదే - ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ తొలి చిత్రం వివరాలు ఇవే

13 బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిది.. అంతరిక్షానికి సంబంధించి ఇప్పటి వరకూ మానవాళి చూడని అతి సుదూరమైన దృశ్యమిది. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఈ అద్భుత చిత్రాన్ని ఆవిష్కరించింది.

అంతరిక్ష ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న.. 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్' తీసిన తొలి చిత్రం విడుదలైంది. ఈ చిత్రాన్ని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ వైట్ హౌస్ లో  ఆవిష్కరించారు. విశ్వానికి సంబంధించి అత్యద్భుతమైన ఈ చిత్రంలో వేలాది గేలాక్సీలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. నీలం, నారింజ, తెలుపు రంగుల్లో ఇవి దర్శనమిస్తున్నాయి. విశ్వం ప్రారంభమైన నాటి అత్యంత స్పష్టమైన చిత్రమిదేనని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ వివరించారు.

'మేం 13 బిలియన్ సంవత్సరాల క్రితం నాటి విశ్వాన్ని చూస్తున్నాం. ఈ చిత్రంలో మీరు చూస్తున్న కాంతి 13 బిలియన్ సంవత్సరాలుగా ప్రయాణిస్తోంది. ఇది బిగ్ బ్యాంగ్ కంటే కేవలం 800 మిలియన్ సంవత్సరాల చిన్నది' అని నెల్సన్ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

ఇక ఈ చిత్రాన్ని విడుదల చేస్తూ అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ మాట్లాడుతూ 'నేడు చారిత్రకమైనరోజు.. - అమెరికాకు, మానవాళికి ఇది ఒక గుర్తుండిపోయే ఘట్టం' అని అభివర్ణించారు. ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మాట్లాడుతూ 'ఇది మనందరికీ చాలా ఉత్తేజకరమైన క్షణం. విశ్వంలో కొత్త అధ్యాయానికి ఈ రోజు నాంది' అని కొనియాడారు.

విశ్వంలోనే అతిభారీ టెలిస్కోప్ గా జేమ్స్ వెబ్ టెలిస్కోప్ రికార్డు సృష్టించింది. 'ఈ టెలిస్కోప్ సైన్స్ కార్యకలాపాల అధికారిక ప్రారంభాన్ని తొలి చిత్రం విడుదల సూచిస్తోంది. ఇది దాని మిషన్లో భాగంగా కీలకమైన అన్వేషణలను కొనసాగిస్తోంది' అని నాసా పేర్కొంది. జేమ్స్ వెబ్ సాధించాల్సిన తొలి ఐదు లక్ష్యాలను నాసా శుక్రవారం వెల్లడించింది.

విశ్వం గుట్టు ఛేదించేందుకు అమెరికా, ఐరోపా, కెన అంతరిక్ష సంస్థలు సంయుక్తంగా 'జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్టీ)ను రూపొందించాయి. 2021 డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. నిప్పులు చిమ్ముకుంటూ ఎరియాన్-5 రాకెట్ దీన్ని నింగిలోకి తీసుకెళ్లింది. ఇప్పటికే రోదసీలో ఉన్న హబుల్ టెలిస్కోప్ స్థానంలో జేడబ్ల్యూఎస్టీని ప్రవేశ పెట్టారు. ఈ అధునాతన సాధనంతో శాస్త్రవేత్తలు విశ్వం పుట్టుక, రహస్యం, నక్షత్రాలు వంటి పలు అంశాలను ఛేదించనున్నారు. భారీ వ్యయప్రయాసాల కోర్చి దాదాపు రూ. 73 వేల కోట్లతో ఈ టెలిస్కోప్ ప్రయోగాన్ని చేపట్టారు. వాస్తవానికి దీని కార్యకలాపాలు 10 సంవత్సరాలపాటు కొనసాగుతాయని భావించినప్పటికీ.. ఇందులో 20 ఏళ్లు నిరంతరంగా పనిచేయడానికి తగినంత ఇంధన సామర్థ్యం ఉందని నాసా వెల్లడించింది.

Previous
Next Post »
0 Komentar

Google Tags