Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Roger Federer Fulfills "Pinky Promise" Five Years Later by Surprising Young Fan in Zurich

 

Roger Federer Fulfills "Pinky Promise" Five Years Later by Surprising Young Fan in Zurich

రోజర్ ఫెదరర్: ఐదేళ్ల తర్వాత యువ అభిమాని "పింకీ ప్రామిస్" నెరవేర్చిన టెన్నిస్ మాస్ట్రో

ఎప్పుడో ఐదేళ్ల కిందట ఓ చిన్నపిల్లవాడికి ఇచ్చిన ప్రామిస్ ను నెరవేర్చాడు టెన్నిస్ అగ్రశ్రేణి ఆటగాడు రోజర్ ఫెదరర్. తాజాగా సర్ ప్రైజ్ చేస్తూ తనతో ఆడాలనే యువకుడి కోరికను ఫెదరర్ తీర్చేశాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే ఓ ఐదేళ్లు వెనక్కి వెళ్లాలి.

అది 2017.. ఆ పిల్లవాడి పేరు ఇజ్యాన్ అహ్మద్. అతడు టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరరకు బిగ్ ఫ్యాన్. ఓ మ్యాచ్ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఫెదరర్ కు ఓ ప్రశ్న సంధించాడు. “ఫెదరర్ మీరు కనీసం ఇంకో 8-9 సంవత్సరాలు ఆడతారా..? ఎందుకంటే కాస్త పెద్దయ్యా క మీతో ఆడతా" అని అడిగాడు. సమాధానంగా 'తప్పకుండా' అని ఫెదరర్ బదులిచ్చాడు. వెంటనే "అది వాగ్దానమేగా? " అని ఇజ్యాన్ అడుగుతాడు. దానికి నవ్వుతూ 'పింకీ ప్రామిస్' అని రోజర్ సమాధానం ఇచ్చాడు. జిజా అని ముద్దుగా పిలుచుకునే ఇజ్యాన్ సంబరపడిపోయాడు.

ప్రస్తుతం…

ఐదేళ్ల తర్వాత తాజాగా ఇజ్యాన్ అహ్మద్ కల నెరవేరింది. అదెలాగంటే . టెన్నిస్ ను కెరీర్ గా ఎంచుకున్న జిజౌ ఇప్పుడు జ్యూరిచ్ కు ట్రైనింగ్ సెషన్ కోసం వచ్చాడు. అక్కడ అతడిని స్పెషల్ గా ట్రీట్ చేయడం.. అభిమానులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ.. ఫొటోలు దిగుతూ ఉంటారు. ఇదెంతో జిజౌ ను ఆశ్చర్యానికి గురి చేసింది. అసలేం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితిలోకి వెళ్లిపోయాడు. అయితే ఈ సన్నివేశాలను రోజర్ ఫెదరర్ టీవీలో చూస్తున్నాడన్న విషయం జిజౌ కు తెలియదు.

ఎందుకంటే ఇదంతా ప్లాన్ చేసిందే రోజర్ ఫెదరర్.. ఆ తర్వాత జిజౌ ను క్లే కోర్టులోకి సిబ్బంది తీసుకెళ్లారు. “ఓ అద్భుతమైన ప్రత్యర్థితో నువ్వు తలపడటం చూడాలని యువత ఉత్సాహంగా ఎదురు చూస్తోంది” అని సిబ్బంది చెప్పిన వెంటనే అక్కడికి రోజర్ ఫెదరర్ వచ్చేస్తాడు. దీంతో జిజౌ ఒక్కసారిగా ఉద్వేగానికి గురై ఫెదరర్ ను హత్తుకున్నాడు. అనంతరం కాసేపు ఇద్దరూ టెన్నిస్ ఆడి అభిమానులను ఉత్సాహపరిచారు. ఈ మొత్తం ఎపిసోడ్ వీడియోను మీరూ చూసేయండి..

Previous
Next Post »
0 Komentar

Google Tags