Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UK PM Election Results 2022: Liz Truss to Be Next Prime Minister of UK

 

UK PM Election Results 2022: Liz Truss to Be Next Prime Minister of UK

బ్రిటన్ తదుపరి ప్రధానమంత్రిగా లిజ్ ట్రస్ - మూడో మహిళా ప్రధానిగా లిజ్ రికార్డు

బ్రిటన్ ప్రధాని ఎంపికలో ఉత్కంఠకు తెరపడింది. బోరిస్ జాన్సన్ రాజీనామా తర్వాత కొత్త ప్రధానిగా ఎవరు ఎన్నిక కాబోతున్నారో తేలిపోయింది. సోమవారం వెల్లడైన తుది ఫలితాల్లో కన్జర్వేటివ్ పార్టీ నేతగా, ప్రధానిగా లిజ్ ట్రస్ (Liz Truss) విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునాక్ (Rishi Sunak), లిజ్ ట్రస్ (Liz Truss) కు మధ్య హోరాహోరీగా సాగిన ఈ పోరులో ఆమెకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయంటూ సర్వేలన్నీ ఘంటా పథంగా చెబుతూ వచ్చిన సంగతి తెలిసిందే. సర్వేల అంచనాలను నిజం చేస్తూ మార్గరెట్ థాచర్, థెరిసా మే తర్వాత బ్రిటన్ పగ్గాలు చేపట్టిన మూడో మహిళా ప్రధానిగా లిజ్ రికార్డు సృష్టించారు. లిజ్ ట్రస్ బ్రిటన్ విదేశాంగ శాఖ మంత్రిగా ఉన్నారు.

కన్జర్వేటివ్ పార్టీ నేతను ఎన్నుకొనేందుకు గడిచిన ఆరు వారాలుగా సాగిన హోరాహోరీ ప్రచారంతో పాటు పార్టీలో అంతర్గతంగా పోలింగ్ జరిగ్గా.. తాజాగా తుది ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఎన్నికల్లో లిజ్ ట్రస్ కు 81,326 ఓట్లు రాగా.. రిషి సునాక్ కు 60,339 ఓట్లు వచ్చాయి. దీంతో దాదాపు 21వేల ఓట్ల తేడాతో సునాక్ పై లిజ్ పైచేయి సాధించారు. బ్రిటన్ ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా లిజ్ ట్రస్ తన ఆనందాన్ని వ్యక్తంచేశారు. తనకు ఓటు వేసిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తాను ప్రజల ప్రధానిగా ఉంటానని ప్రకటించారు. వచ్చే రెండేళ్లలో పన్నులు తగ్గించి ఆర్థిక వ్యవస్థను వృద్ధి చేసేందుకు ధైర్యమైన ప్రణాళికలను అందిస్తానన్నారు. ఇంధన సంక్షోభాన్ని పరిష్కరించనున్నట్టు తెలిపారు.

ప్రారంభంలో ముందంజలో రిషి సునాక్..

కన్జర్వేటివ్ పార్టీ నేత ఎన్నిక ప్రక్రియ మొదలైన తర్వాత ప్రారంభ దశలో రిషి సునాక్ (Rishi Sunak) ముందంజలో దూసుకెళ్లారు. ఎంపీల్లో ఎక్కువ మద్దతు ఆయనకే లభించింది. విదేశాంగ మంత్రి ట్రస్ కు టోరి ఎంపీల మద్దతు తక్కువనే చెప్పవచ్చు. వారి పోలింగ్ లో ట్రస్ రెండో స్థానంలో నిలిచారు. అయితే, పార్టీ సభ్యులు వేసే ఆన్ లైన్, పోస్టల్ బ్యాలెట్ ద్వారా పోలింగ్ మొదలైనప్పటి నుంచి ట్రస్ కు ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. అధికారంలోకి వస్తే వెంటనే పన్నుల భారాన్ని తగ్గిస్తానని లిజ్ ట్రస్ పేర్కొనడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. అయితే, సునాక్ మాత్రం ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడం పై ప్రధానంగా దృష్టి పెడతాననే నినాదంతో ముందుకు వెళ్లారు.

ఇలా ప్రచారం ముగింపు దశకు చేరుకున్న సమయంలో వచ్చిన సర్వేలు లిజ్ ట్రస్ కే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంచనా వేశాయి. అయినప్పటికీ విశ్వాసం కోల్పోని సునాక్.. చివరి క్షణంలోనూ ప్రచారాన్ని దూకుడుగానే కొనసాగించారు. తాము ఎన్నికైనట్లయితే ఇంధన సంక్షోభాన్ని సమర్థంగా ఎదుర్కొంటామని ఇద్దరూ ఆదివారం వేర్వేరుగా ప్రకటించారు. హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారంలో ఇద్దరు నేతలు మంచి స్ఫూర్తితో ప్రచారాన్ని నిర్వహించారని కన్జర్వేటరీ పార్టీ ఛైర్మన్ ఆండ్రూ స్టీఫెన్సన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో పార్టీ సభ్యులు అడిగిన దాదాపు 600 ప్రశ్నలకు ఇరువురు నేతలు సమాధానాలు ఇచ్చినట్లు చెప్పారు.

Previous
Next Post »
0 Komentar

Google Tags