Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

FIFA World Cup Qatar 2022: All the Details Here

 

FIFA World Cup Qatar 2022: All the Details Here

ఫుట్ బాల్ వరల్డ్ కప్ -2022: ప్రత్యేకతలు మరియు తెలుసుకోవాలిసిన విషయాలు ఇవే

ఖతర్ దేశపు రాజధాని దోహా వేదికగా 22వ ఫుట్ బాల్ వరల్డ్ కప్ కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే తొలి మ్యాచ్ లో  ఆతిథ్య ఖతర్ తో ఈక్వెడార్ తలపడుతుంది. ఖతర్ జాతీయ దినోత్సవం అయిన డిసెంబర్ 18న ఫైనల్ జరుగుతుంది. 2006లో ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చిన తర్వాత ఖతర్లో మరో మెగా క్రీడా సంబరం ఇదే కావడం విశేషం. 2002లో జపాన్-దక్షిణ కొరియా సంయుక్తంగా పోటీలను నిర్వహించిన తర్వాత ఒక ఆసియా దేశంలో 'ఫిఫా' ప్రపంచ కప్ జరగడం ఇది రెండోసారి కాగా... ఒక మధ్యప్రాచ్య దేశం విశ్వ సంరంభానికి వేదిక కావడం ఇదే మొదటిసారి. 32 టీం లతో నిర్వహించనున్న ఆఖరి వరల్డ్ కప్ ఇదే కానుంది. వచ్చే ఈవెంట్ నుంచి 48 జట్లు బరిలోకి దిగుతాయి.

విజేత కి భారీ ప్రైజ్ మనీ

ప్రపంచకప్ లో  విజేతగా నిలిచే జట్టు అందుకునే నగదు బహుమతి  రూ.344 కోట్లు.

రన్నరప్ కు  రూ.245 కోట్లు దక్కుతాయి.

మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు వరుసగా రూ. 220 కోట్లు, రూ. 204 కోట్లు సొంతం చేసుకుంటాయి.

అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడు

ప్రపంచకప్ చరిత్రలో అత్యధిక గోల్స్ (16) చేసిన ఆటగాడిగా కొనసాగుతున్న మిరోస్లావ్ క్లోజ్ (జర్మనీ మాజీ ఆటగాడు) చేసిన గోల్స్. దేశం పరంగా చూసుకుంటే బ్రెజిల్ (229) అగ్రస్థానంలో ఉంది.

ఇప్పటివరకూ జరిగిన అన్ని (21)  ప్రపంచకప్ ల్లోనూ ఆడిన ఏకైక దేశంగా బ్రెజిల్ కొనసాగుతోంది. జర్మనీ (19), ఇటలీ (18), అర్జెంటీనా (17) వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

పురుషుల ప్రపంచకప్ లో తొలిసారి మహిళా రిఫరీలు మైదానాల్లో కనిపించనున్నారు. సలీమా, యొషిమి, స్టెఫానీ ఆ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

ఇప్పటివరకు ఎనిమిది దేశాలు మాత్రమే విజేతలు

ఇప్పటివరకూ 21 ప్రపంచకప్లు జరగ్గా.. కేవలం ఎనిమిది దేశాలు మాత్రమే కనీసం ఒక్కసారైనా విశ్వవిజేతగా

నిలిచాయి. రికార్డు స్థాయిలో అత్యధికంగా అయిదు సార్లు బ్రెజిల్ కప్పు గెలుచుకుంది. ఇటలీ, జర్మనీ చెరో నాలుగు సార్లు ఛాంపియన్లుగా నిలిచాయి. ఉరుగ్వే, అర్జెంటీనా, ఫ్రాన్స్ తలా రెండు సార్లు టైటిల్ దక్కించుకున్నాయి. ఇంగ్లాండ్, స్పెయిన్ ఒక్కోసారి కప్పును ముద్దాడాయి. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ప్రపంచకప్ 1930లో మొదలైంది. రెండో ప్రపంచ యుద్ధం కారణంగా 1942, 1946లో టోర్నీని నిర్వహించలేదు.

ఈ సారి మస్కట్ ఇదే.

ఫిఫా ప్రపంచకప్ అనగానే ముందుగా టోర్నీకి ఆకర్షణగా నిలిచే మస్కట్ గుర్తుకొస్తుంది. ఈ సారి కూడా టోర్నీ అధికారిక మస్కట్ “లాయిబ్'ను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ముస్లిం పురుషులు సంప్రదాయంగా తలపై ధరించే వస్త్రం (గత్రా)ను పోలి ఉండే దుస్తులు ధరించి గాల్లోకి ఎగురుతూ ఫుట్బాల్ ఆడేలా మస్కట్ ను రూపొందించారు. "లాయిబ్' అంటే అరబిక్ లో "అద్భుతమైన నైపుణ్యాలున్న ఆటగాడు" అని అర్థం. ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని, తమను తాము నమ్మాలని ఈ మస్కట్ చాటుతోంది.

రొనాల్డో, మెస్సి, నెయ్మార్ - ఈ సారి ఎవరు?

అభిమానులను ఆకర్షించే సమ్మోహన శక్తి ఉన్న ఆటగాళ్లు కొద్దిమందే. ఈ ప్రపంచకప్ వరకు ప్రధానంగా చెప్పుకోవాల్సింది రొనాల్డో, మెస్సి, నెయ్మార్ల గురించే. ఆట పరంగా వీరిలో ఎవరి ఆకర్షణ వారిదే. ముగ్గురూ అంతర్జాతీయ స్థాయిలో, క్లబ్ ఫుట్బాల్లో ఎన్నో ఘనతలు సాధించారు. కానీ ఆ ముగ్గురికీ కప్పు కల నెరవేరలేదు.

రొనాల్డో మేటి ఆటగాడే అయినా అతడి జట్టు పోర్చుగల్క కప్పు గెలిచేంత స్థాయి లేదు. కానీ పోర్చుగల్ ఆడుతుంటే ఫుట్బాల్ ప్రపంచం మొత్తం దృష్టి రొనాల్డో మీద ఉంటుంది. ప్రస్తుతం ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ సాధించిన ఆటగాడు అతనే. రికార్డుల్లో అతడికి చేరువగానే ఉన్న మెస్సి.. ఆటతో చేసే మాయాజాలం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడి జట్టు టైటిల్ ఫేవరెట్లలో ఒకటి కావడంతో మరింతగా మెస్సి మీద దృష్టి ఉంటుంది. ఇక కచ్చితంగా కప్పు గెలుస్తుందని అంచనాలున్న బ్రెజిల్ జట్టుకు అతి పెద్ద ఆకర్షణ నెయ్మార్. ఆధునిక దిగ్గజాల్లో ఒకడిగా రూపుదిద్దుకుంటున్న నెయ్మార్.. ఈసారి ప్రపంచకప్లో ఎలాంటి విన్యాసాలు చేస్తాడో చూడాలి.

Previous
Next Post »
0 Komentar

Google Tags