Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Income Tax Dept Issues Warning About Not Linking PAN with Aadhaar – Check the Details

 

Income Tax Dept Issues Warning About Not Linking PAN with Aadhaar – Check the Details

పాన్‌ - ఆధార్‌ అనుసంధానం పై ఆదాయపు పన్ను శాఖ హెచ్చరిక – వివరాలు ఇవే

పాన్ నెంబర్ తో  ఆధార్ నెంబర్ ను  (PAN- Aadhaar) అనుసంధానం చేసుకోని వారు వెంటనే లింక్ చేసుకోవాలని పన్ను చెల్లింపుదారులను ఆదాయపు పన్ను శాఖ (IT dept) తాజాగా కోరింది. వచ్చే ఏడాది మార్చి 31లోపు ఆ ప్రక్రియ పూర్తి చేయాలని మరోసారి గుర్తుచేసింది. లేదంటే పాన్ కార్డు నిరుపయోగంగా మారిపోతుందని పేర్కొంది. ఈ మేరకు ఐటీ శాఖ ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలియజేసింది.

"ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం మినహాయింపు పరిధిలోకి రాని పాన్ కార్డ్  హోల్డర్లు తమ పాన్ ను ఆధార్ తో  అనుసంధానం చేసుకోవాలి. ఇందుకు 2023 మార్చి 31 వరకు మాత్రమే గడువు ఉంది. ఒకవేళ అనుసంధానం పూర్తి చేయకపోతే మీ పాన్ నిరుపయోగంగా మారిపోతుంది. గడువు తేదీ దగ్గరపడుతోంది కాబట్టి ఇవాళే అనుసంధానం పూర్తి చేయండి" అని తన ట్విటర్లో పేర్కొంది.

పాన్ తో  ఆధార్ అనుసంధానం పూర్తి చేయాలంటే మీరు వెయ్యి రూపాయలు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ప్రస్తుతం పెనాల్టీతో అనుసంధానానికి అనుమతిస్తున్నారు. ఒకవేళ నిర్దేశించిన గడువులోగా ఆ ప్రక్రియ పూర్తి చేయపోతే పాన్ నిరుపయోగంగా మారి బ్యాంక్ ఖాతాలు గానీ, డీమ్యాట్ అకౌంట్ గానీ తెరవడానికి సాధ్యపడదు.

చెల్లింపు ఎలా..?

పాన్- ఆధార్ అనుసంధానానికి ముందు మీరు ఫైన్ చెల్లించాల్సి ఉంటుంది. అందుకోసం egov-nsdl.com అనే వెబ్సైట్ కి వెళ్లాలి.

ఇందుకోసం తొలుత Tax applicable - (0021) ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత (500) Other Receipts ఆప్షన్ ఎంచుకోవాలి.

తర్వాత పాన్, మదింపు సంవత్సరం, పేమెంట్ విధానం, అడ్రస్, ఇ-మెయిల్, మొబైల్ నంబర్ తదితర వివరాలు ఇవ్వాలి.

క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి పేమెంట్ పూర్తి చేయాలి.

ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి చేశాక 4-5 రోజుల సమయం పడుతుంది. ఆ తర్వాత ఐటీ శాఖ ఈ-ఫైలింగ్ వెబ్సైట్లో పాన్ ఆధార్ ను అనుసంధానం చేసుకోవచ్చు. 

PAYMENT WEBSITE

PAYMENT LINK

AADHAAR PAN LINK

AADHAAR LINK STATUS

ITR WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags