Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

TSPSC: Apply for 1392 Junior Lecturer Posts – Details Here

 

TSPSC: Apply 1392 Junior Lecturer Posts – Details Here

తెలంగాణలో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టులు - జీత భత్యాలు: రూ.54,220 - రూ.1,33,630.

రాష్ట్రంలోని  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 1392 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్ పీఎస్సీ) నోటిఫికేషన్ (22/2022) విడుదల చేసింది. మల్టీ జోన్-1లో 724, మల్టీ జోన్-2లో 668 పోస్టులను భర్తీ చేయనుంది. కమిషన్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో జూనియర్ లెక్చరర్ పోస్టులకు ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి. 

2008లో ఉమ్మడి రాష్ట్రంలో 1100 జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల కాగా, తాజాగా 1392 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు డిసెంబర్ 16 నుంచి 2023 జనవరి 6 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల భర్తీకి రాతపరీక్ష 2023 జూన్ లేదా జులైలో నిర్వహించనున్నారు.

సబ్జెక్టు వారీగా ఖాళీలు:

1. అరబిక్: 02 పోస్టులు

2. బోటనీ: 113 పోస్టులు

3. బోటనీ (ఉర్దూ మీడియం): 15 పోస్టులు

4. కెమిస్ట్రీ: 113 పోస్టులు

5. కెమిస్ట్రీ (ఉర్దూ మీడియం): 19 పోస్టులు

6. సివిక్స్: 56 పోస్టులు

7. సివిక్స్ (ఉర్దూ మీడియం): 16 పోస్టులు

8. సివిక్స్ (మరాఠీ మీడియం): 01 పోస్టు

9. కామర్స్: 50 పోస్టులు

10. కామర్స్ (ఉర్దూ మీడియం): 07 పోస్టులు

11. ఎకనామిక్స్: 81 పోస్టులు

12. ఎకనామిక్స్ (ఉర్దూ మీడియం): 15 పోస్టులు

13. ఇంగ్లిష్: 153 పోస్టులు

14. ఫ్రెంచ్: 02 పోస్టులు

15. హిందీ: 117 పోస్టులు

16. హిస్టరీ: 77 పోస్టులు

17. హిస్టరీ (ఉర్దూ మీడియం): 17 పోస్టులు

18. హిస్టరీ (మరాఠీ మీడియం): 01 పోస్టు

19. మ్యాథ్స్: 154 పోస్టులు

20. మ్యాథ్స్ (ఉర్దూ మీడియం): 09 పోస్టులు

21. ఫిజిక్స్: 112 పోస్టులు

22. ఫిజిక్స్ (ఉర్దూ మీడియం): 18 పోస్టులు

23. సంస్కృతం: 10 పోస్టులు

24. తెలుగు: 60 పోస్టులు

25. ఉర్దూ: 28 పోస్టులు

26. జువాలజీ: 128 పోస్టులు

27. జువాలజీ (ఉర్దూ మీడియం): 18 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 1392

వయోపరిమితి: 01/07/2022 నాటికి 18 - 44 సంవత్సరాల మధ్య ఉండాలి.

జీత భత్యాలు: రూ.54,220 - రూ.1,33,630.

అర్హతలు: సంబంధిత సబ్జెక్టు/ భాషలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు: రూ.200

పరీక్ష ఫీజు: రూ.120.

రాత పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, హనుమకొండ, నిజామాబాద్.

ఎంపిక విధానం: రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్), సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఆధారంగా.

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16/12/2022. 20/12/2022

ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ: 06/01/2023. 10/01/2022

పరీక్ష తేదీ (ఆబ్జెక్టివ్ టైప్): జూన్, జులై-2023.

APPLICATION

REVISED DATES

NOTIFICATION

WEBSITE

Previous
Next Post »
0 Komentar

Google Tags