TS POLYCET-2023:
ALL THE DETAILS HERE
టీఎస్ పాలీసెట్-2023:
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ – పూర్తి వివరాలు ఇవే
=======================
తెలంగాణ
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023 తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాలిటెక్నిక్ లో సీట్ల భర్తీకి ఉద్దేశించిన
పాలిసెట్-2023 నోటిఫికేషన్ విడుదలైంది.
విద్యార్థులు జనవరి 16 నుంచి ఏప్రిల్ 24 వరకు ఆలస్య రుసుం లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. మే 17న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలల్లోని డిప్లొమా(ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్/ టెక్నాలజీ, అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ, ఫిషరీస్) సీట్లను
పాలిసెట్ ర్యాంకు ఆధారంగా భర్తీ చేస్తారు.
కోర్సులు
అందించే సంస్థలు/ విశ్వవిద్యాలయాలు: ప్రభుత్వ / ఎయిడెడ్ / అన్ఎయిడెడ్
పాలిటెక్నిక్స్ / ఇన్స్టిట్యూట్ లో ఇంజినీరింగ్, నాన్-ఇంజినీరింగ్ / టెక్నాలజీ డిప్లొమా. ఆచార్య ఎనీ రంగా వ్యవసాయ
విశ్వవిద్యాలయంలో అగ్రికల్చర్ డిప్లొమా. శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర
ఉద్యాన విశ్వవిద్యాలయం హార్టికల్చర్ డిప్లొమా. పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ
విశ్వవిద్యాలయంలో వెటర్నరీ, ఫిషరీస్ డిప్లొమా.
తెలంగాణ
పాలిటెక్నిక్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2023
అర్హత:
పదోతరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత.
పరీక్ష ఫీజు:
రూ.500,
ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.250.
ముఖ్యమైన తేదీలు. . .
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ ప్రారంభం: 16-01-2023.
ఆన్లైన్
రిజిస్ట్రేషన్ కోసం చివరి తేదీ: 24-04-2023.
ఆలస్య రుసుము
రూ.100తో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: 25-04-2023.
పరీక్ష
నిర్వహణ తేదీ: 17-05-2023.
=======================
=======================
0 Komentar