Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

WhatsApp New Feature: ‘Companion Mode’ Feature - WhatsApp Can Be Used on Other Mobile Phones Without Log Out

 

WhatsApp New Feature: ‘Companion Mode’ Feature - WhatsApp Can Be Used on Other Mobile Phones Without Log Out

వాట్సాప్ మరో కొత్త ఫీచర్:  'కంపానియన్ మోడ్' ఫీచర్ తో లాగౌట్ కాకుండానే మరో మొబైల్ ఫోన్లలోనూ వాట్సాప్

========================

వాట్సాప్ మరో కొత్త ఫీచర్ 'కంపానియన్ మోడ్' ని తీసుకొచ్చింది. ఇప్పటి వరకు వాట్సాప్ మనం ఒకే ఫోన్ లో వాడేందుకు అనుమతి ఉంది. తాజాగా తీసుకొస్తున్న కంపానియన్ ఫీచర్ తో మొదటి దాని నుంచి లాగౌట్ కాకుండానే మరో మొబైల్ ఫోన్లలోనూ వాట్సాప్ వాడొచ్చు. అంటే ఒకేసారి రెండు ఫోన్లలోనూ ఒకే వాట్సాప్ అకౌంట్ ను వాడుకోవచ్చు. మొదటి ఫోన్లో ఇంటర్నెట్ లేకపోయినా రెండో దాంట్లో చాట్ హిస్టరీని వీక్షించొచ్చు. మెసేజ్ పంపడం, మీడియాను వీక్షించడం వంటివన్నీ చేయొచ్చు.

ఈ కంపానియన్ మోడ్ . ఇప్పటికే ఉన్న మల్టీ డివైజ్ సపోర్టు అదనపు ఫీచర్ చెప్పొచ్చు. మల్టీడివైజ్ ఫీచర్ వల్ల ఒక మొబైల్ ఫోన్ తో పాటు పర్సనల్ కంప్యూటర్ లేదా ట్యాబ్లెట్ లో వాట్సాప్ వాడేందుకు వీలుంది. అదీ ప్రైమరీ డివైజ్ లో  ఇంటర్నెట్ లేకున్నా సరే. కానీ, ఒక మొబైల్లో వినియోగిస్తూ.. మరో ఫోన్లో వాడడానికి మాత్రం మల్టీ డివైజ్ ఫీచర్ పనిచేయడం లేదు. దానికి పరిష్కారంగానే తాజా కంపానియన్ మోడ్ వస్తోంది.

ప్రస్తుతానికి కంపానియన్ మోడ్ ఫీచర్ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. 2022 నవంబరులోనే ఎంపిక చేసిన బీటా టెస్టర్లకు వాట్సాప్ ఈ ఫీచర్ ను అందించింది. నిజానికి ఈ ఫీచర్ కోసం యూజర్లు ఎప్పటి నుంచో వేచిచూస్తున్నారు. ఒకటి కంటే ఎక్కువ ఫోన్లు వాడేవాళ్లకు తరచూ వాట్సాప్ లో కొత్తగా లాగిన్ కావడమంటే కొంత ఇబ్బందికరమైన విషయమే.

======================== 

ఇలా లింక్ చేయండి..

1. సెకండరీ ఆండ్రాయిడ్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి వాట్సాప్ మెసెంజర్ లేదా వాట్సాప్ బిజినెస్ లేటెస్ట్ యాప్ ను డౌన్లోడ్ చేయాలి.

2. రిజిస్ట్రేషన్ స్క్రీన్ లో కనిపించే ఓవర్లో మెనూపై క్లిక్ చేయాలి. అందులో 'లింక్ ఏ డివైజ్' అనే ఆప్షన్ ఉంటుంది.

3. ప్రైమరీ డివైజ్లో వాట్సాప్ ఓపెన్ చేయాలి. సెట్టింగ్స్లోకి వెళ్లి 'లింక్డ్ డివైజెస్' పై క్లిక్ చేయాలి.

4. రెండో ఫోన్లో ఉండే క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసేలా ప్రైమరీ డివైజ్ను ఉంచాలి.

5. ఇలా మొదటి ఫోన్లో లాగౌట్ కాకుండానే మరో ఫోన్లో కూడా వాట్సాప్ ను వాడొచ్చు.

======================== 

OFFICIAL WEBSITE POST LINK

======================== 

Previous
Next Post »
0 Komentar

Google Tags