Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Padma Awards 2024: Nomination Process Started for the Public - Details Here

 

Padma Awards 2024: Nomination Process Started for the Public - Details Here

పద్మ అవార్డుల కోసం నామినేషన్లు పంపాలని ప్రజలకు కేంద్రం విజ్ఞప్తి నామినేషన్ల పోర్టల్ లింక్ ఇదే

==========================

ప్రతిభావంతులను గుర్తించి పద్మ అవార్డులకు అర్హులైన వారి పేర్లను సిఫార్సు చేయాలని కేంద్రం సోమవారం ప్రజలకు విజ్ఞప్తి చేసింది. వచ్చే ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రకటించే ఈ పురస్కారాల కోసం ఆన్లైన్లో నామినేషన్లు, సిఫార్సుల స్వీకరణ ప్రక్రియ సోమవారం నుంచి తెరుచుకున్నట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబరు 15లోగా ప్రతిపాదనలను పంపొచ్చని పేర్కొంది. 'రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో వీటిని సమర్పించొచ్చని వివరించింది.

స్వీయ నామినేషన్లు కూడా పంపొచ్చని తెలిపింది. ఈ అవార్డుల్లో పద్మ విభూషణ్, పద్మ భూషణ్, పద్మశ్రీ పురస్కారాలు ఉంటాయి. _ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఏటా వీటిని ప్రకటిస్తుంటారు. కళలు, సాహిత్యం, విద్య, క్రీడలు, వైద్యం, సామాజిక సేవ, సైన్స్, ఇంజినీరింగ్, పౌర సేవల, వాణిజ్యం, పరిశ్రమలు తదితర రంగాల్లో అసాధారణ కృషి చేసినవారిని గుర్తించడం ఈ అవార్డుల ఉద్దేశమని కేంద్రం తెలిపింది.

==========================

APPLY OR NOMINATE

WEBSITE

==========================

Previous
Next Post »
0 Komentar

Google Tags