Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

French Open Men’s Final 2023: Novak Djokovic Wins Roland Garros 2013 and Records 23rd Grand Slam Title

 

French Open Men’s Final 2023: Novak Djokovic Wins Roland Garros 2013 and Records 23rd Grand Slam Title

ఫ్రెంచ్‌ ఓపెన్‌ - 2023 విజేత గా జకోవిచ్ - 3వ ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ మరియు మొత్తంగా 23 వ గ్రాండ్ స్లామ్ తో అత్యధిక గ్రాండ్ స్లామ్ ల విజేత గా నొవాక్

========================

2023 ఫ్రెంచ్ ఓపెన్ ను నొవాక్ జకోవిచ్ (సెర్బియా) గెలిచాడు. ఆదివారం కాస్పర్ రూడ్ (నార్వే) పై 7-6, 6-3, 7-5 తేడాతో గెలుపొంది 23వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ క్రమంలోనే రఫెల్ నాదల్ (22)ను వెనక్కినెట్టి పురుషుల సింగిల్స్ అత్యధిక గ్రాండ్ స్లామ్ లు నెగ్గిన తొలి ఆటగాడిగా జకోవిచ్ రికార్డు సృష్టించాడు. జకోవిచ్ ఇప్పటివరకు 10 ఆస్ట్రేలియన్ ఓపెన్, 3 యూఎస్ ఓపెన్, 3 ఫ్రెంచ్ ఓపెన్, 7 వింబుల్డన్ టైటిళ్లను సొంతం చేసుకున్నాడు.

తొలి సెట్ హోరాహోరీగా సాగింది. జకోవిచ్ సర్వీస్లను బ్రేక్ చేస్తూ ఒక దశలో కాస్పర్ రూడ్ 3-0తో ఆధిక్యంలో కనిపించాడు. అయితే, సెర్బియా స్టార్ మళ్లీ పుంజుకొని రూడ్ సర్వీస్ బ్రేక్ చేసి మూడు పాయింట్లు సాధించాడు. దీంతో 6-6తో తొలి సెట్ టై బ్రేకు దారి తీసింది. కీలకమైన టైబ్రేక్లో జకోవిచ్ తన సత్తా చాటాడు. విన్నర్స్ సంధించి 7-6 (7-1)తో తొలి సెట్ ను సొంతం చేసుకున్నాడు. తొలి సెట్ ను గెల్చుకోవడానికి కష్టపడిన జకోవిచ్.. 6-3తో రెండో సెట్ ను సునాయసంగా కైవసం చేసుకున్నాడు. కీలకమైన మూడోసెట్లో కాస్పర్ రూడ్ పుంజుకున్నాడు. ఒక దశలో 5-5తో స్కోర్లు సమం అవ్వడంతో మళ్లీ టైబ్రేక్ తప్పదనిపించింది. ఈ దశలో రూడ్ సర్వీస్ ను బ్రేక్ చేసిన జకోవిచ్ 7-5తో సెట్ తో పాటు  మ్యాచ్ ను  సొంతం చేసుకున్నాడు.

"ఈ ప్రత్యేక సందర్భాన్ని మీతో పంచుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. పారిస్ లో 23వ టైటిల్ గెలవడం గొప్పగా అనిపిస్తోంది. ఇది చాలా కఠినమైన టోర్నీ. ఇలాంటి కోర్టులో విజయాన్ని అందుకున్నందుకు గర్వంగా ఉంది. ఉత్తమ ఆటగాళ్లలో రూడ్ ఒకడు. అతనితో ఆడడం బాగుంది. నిలకడగా ఆడుతున్న రూడ్.. గ్రాండ్ స్లామ్  విజయాలు సాధించాలని కోరుకుంటున్నా. నాకు మద్దతుగా నిలిచిన కోచింగ్ బృందం, కుటుంబానికి ధన్యవాదాలు. వాళ్లను నేనెంతో హింసించే ఉంటా. ప్రతి ఒక్క ఆటగాడు ఒక్కసారైనా గ్రాండ్ స్లామ్ గెలవాలనుకుంటాడు. కానీ అదృష్టవశాత్తూ నేను 23 సార్లు ఆ ఘనత సాధించా. ఏడేళ్ల వయసులో వింబుల్డన్ గెలవాలని, ప్రపంచ నంబర్వన్ కావాలని కలలు కన్నా. గతం గురించి ఆలోచించి వర్తమానంపై దృష్టి పెట్టి కష్టపడితే విజయాలు దక్కుతాయి" జకోవిచ్

========================

Previous
Next Post »
0 Komentar

Google Tags