Jio Independence Day 2023 Offer -
Details Here
జియో
స్వాతంత్ర్య దినోత్సవం 2023 ఆఫర్ - లాంగ్ టర్మ్
ప్లాన్ – వివరాలు ఇవే
=========================
జియో కొత్త
గా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా మరో లాంగ్ టర్మ్ ప్లాన్ ను తమ కస్టమర్లకు
అందించింది. స్వాతంత్ర్య దినోత్సవ ఆఫర్ కింద రూ.2,999 తో ఏడాది కాలవ్యవధితో ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పరిచయం చేసింది. దీంతో పాటూ
ఉచితంగా రూ.5,800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో
ప్రకటించింది. లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం ఎదురు చూస్తున్న వారు ఈ ప్లాన్ వివరాలపై ఓ
లుక్కేయండి. ప్లాన్ విషయానికొస్తే.. రూ.2999తో రీఛార్జితో తీసుకొచ్చిన ఈ జియో ప్రీపెయిడ్ ప్లాన్ కు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్కాల్స్, 100 ఎస్సెమ్మెస్లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా లభిస్తుంది. దీంతో పాటూ జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమాను ఏడాది పాటూ ఉచితంగా
వీక్షించవచ్చు. స్విగ్గీ, యాత్ర, అజియో, నెట్మెడ్స్, రిలయన్స్ డిజిటల్ కొనుగోలుపై రూ.5,800 విలువైన ప్రయోజనాలను కూపన్ల రూపంలో అందిస్తోంది.
కూపన్ల
విషయానికొస్తే.. స్విగ్గీ లో రూ. 240 కంటే ఎక్కువగా ఫుడ్ ఆర్డర్ చేస్తే రూ. 100 డిస్కౌంట్ లభిస్తుంది. ‘యాత్ర’ సాయంతో
విమానాలు బుక్ చేసుకుంటే రూ.1500 డిస్కౌంట్, హోటళ్లలో రూ.4 వేల కంటే
ఎక్కువ వెచ్చిస్తే అందులో 15 శాతం వరకు రాయితీ
పొందవచ్చు. ఇక అజియో లో రూ. 999 కొనుగోలుపై రూ.200 రాయితీ లభిస్తుంది. నెట్మెడ్స్ ద్వారా రూ.999 కి కొనుగోలు చేస్తే 20 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. రిలయన్స్ డిజిటల్లో కొన్ని ఎంపిక చేసిన ఆడియో
ఉపకరణాలు,
గృహోపకరణాలపై 10 శాతం తగ్గింపు ఉంటుంది.
=========================
=========================
Celebrate the freedom to stay connected with Jio's ₹2999/- plan and enjoy multiple benefitshttps://t.co/5DWGjRcCbO#WithLoveFromJio #IndependenceDay #Jio #JioDigitalLife pic.twitter.com/M8jMYjsKYf
— Reliance Jio (@reliancejio) August 12, 2023
0 Komentar