Ola Electric: Ola S1X Electric Scooter
Launched – Price & Feature Details Here
ఓలా ఎస్ 1 ఎక్స్ పేరిట మూడు వేరియంట్లు విడుదల – ధర మరియు ఫీచర్ల వివరాలు
ఇవే
=========================
ఓలా ఎలక్ట్రిక్ మార్కెట్లోకి కొత్త విద్యుత్ స్కూటర్లను తీసుకొచ్చింది. ఆగస్టు 15న సందర్భంగా 'కస్టమర్ డే' పేరిట నిర్వహించిన ఈవెంట్లో వీటిని లాంచ్ చేసింది. ఓలా ఎస్ 1 ఎక్స్ (ola s1x) పేరిట మూడు వేరియంట్లను తీసుకొచ్చింది. ఎస్1 ఎక్స్ (ola S1x) (2kWh), ఎస్1 ఎక్స్ (ola S1x) (3kWh), ఎస్ 1 ఎక్స్+ (ola S1 X+) పేరిట వీటిని లాంచ్ చేసింది. ఈ మూడు మోడళ్లనూ లక్ష రూపాయల్లోగా తీసుకురావడం గమనార్హం. దీంతో తన ప్రొడక్ట్ పోర్ట్ఫోలియోలో ఉన్న ఎస్ 1 ప్రో (ola S1 Pro) సెకండ్ జనరేషన్ ను కూడా ఆవిష్కరించింది. స్కూటర్లతో పాటు మూవ్ ఓఎస్ 4ను ఆవిష్కరించింది. సెప్టెంబర్ 15 నుంచి బీటా వెర్షన్ అందుబాటులో ఉంటుందని ఓలా సీఈఓ భవీశ్ అగర్వాల్ తెలిపారు.
ధర వివరాలు
ఓలా ఎక్స్1 శ్రేణి స్కూటర్లు రెండు రకాల బ్యాటరీ వేరియంట్లతో వస్తున్నాయి. ఓలా ఎక్స్ 1+ స్కూటర్ ధర రూ.1.09 లక్షలు కాగా.. ప్రారంభ ఆఫర్ కింద రూ.99,999కే విక్రయిస్తున్నట్లు ఓలా తెలిపింది. ఆగస్టు 21 వరకు ఈ ధర అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక ఓలా ఎస్ 1ఎక్స్ (3kWh) స్కూటర్ రూ. 99,999గా నిర్ణయించారు. దీన్ని సైతం ఆగస్టు 21 వరకు రూ.10 వేలు తక్కువకే విక్రయించనున్నారు. ఎస్ 1 ఎక్స్ (2 కిలోవాట్ బ్యాటరీ) మోడల్ను రూ. 89,999 కాగా.. ఆగస్టు 21 వరకు రూ. 79,999కే విక్రయించనున్నట్లు భవీశ్ తెలిపారు. అలాగే ఎస్1 ప్రో సెకండ్ జనరేషన్ మోడల్ ధర రూ.1.47 లక్షలు కాగా.. ఎస్ 1 ఎయిర్ రూ.1.19 లక్షలుగా కంపెనీ పేర్కొంది.
ఫీచర్ల వివరాలు
ఎస్ 1 ఎక్స్ శ్రేణి స్కూటర్లలో 5.0 అంగుళాల ఎల్సీడీ డిస్ప్లే ఉంటుంది. ఎస్ 1 ఎక్స్ +, ఎస్ 1 ఎక్స్ (3kWh) వేరియంట్ స్కూటర్లలో 6kW మోటార్ ఉంటుంది. ఇది 151 కిలోమీట్ల రేంజ్ ఇస్తుంది. దీని టాప్ స్పీడ్ 90 కిలోమీటర్లు. అలాగే 2kWh బ్యాటరీ కలిగిన ఎస్ 1 ఎక్స్ 91 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ 85 కిలోమీటర్లుగా తెలిపింది. అలాగే ఎస్ 1 ప్రో సెకండ్ జనరేషన్ వేరియంట్ రేంజ్ను 195 కిలోమీటర్లుగా కంపెనీ పేర్కొంది. దీని టాప్ స్పీడ్ 120 గంటకు కిలోమీటర్లు. కేవలం 2.6 సెకన్లలోనే 0-40 కి.మీ. వేగాన్ని అందుకుంటుందని కంపెనీ తెలిపింది.
భవిష్యత్ లో
నాలుగు మోటార్ సైకిళ్లు
ఓలా నుంచి
నాలుగు విద్యుత్ మోటార్ సైకిళ్లు రాబోతున్నాయి. తాజాగా నిర్వహించిన ఈవెంట్లో
కాన్సెప్టు బైక్స్ను ప్రదర్శించింది. డైమండ్ హెడ్, అడ్వెంచర్, రోడ్లర్, క్రూయిజర్ పేరిట వీటిని తీసుకుసుకురానుంది. వీటి ఫీచర్లు, ఇతర వివరాలేవీ కంపెనీ వెల్లడించలేదు. 2024 చివరికల్లా వీటిని తీసుకురావాలనుకుంటోంది. దేశీయ మార్కెట్తో
పాటు అంతర్జాతీయ మార్కెట్లలోనూ వీటిని విక్రయించాలని ఓలా ఎలక్ట్రిక్ ఆశిస్తోంది.
=========================
=========================
Customer Day 2023 | Main Event https://t.co/GNB0CVRlW1
— Ola Electric (@OlaElectric) August 15, 2023
0 Komentar