Jio 7
Years: Special Vouchers and Extra Data for Prepaid Plans – Details Here
జియో ఏడు
సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో ప్రీ పెయిడ్ ప్లాన్ల ప్రత్యేక ఆఫర్ వివరాలు ఇవే
=========================
జియో ఏడు
సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంలో కంపెనీ ప్రత్యేక ఆఫర్ ను ప్రకటించింది.
ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్రీ పెయిడ్ ప్లాన్లకు అదనపు ప్రయోజనాలను
జోడించింది. ఇప్పటికే ఈ ఆఫర్లు జియో యూజర్లకు అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబరు 30 వరకే ఈ ప్రయోజనాలు పొందొచ్చు.
జియో అందిస్తున్న రూ.299 రీఛార్జితో ఉన్న జియో ప్రీపెయిడ్ ప్లాన్తో 28 రోజుల పాటు అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్లతో పాటు రోజుకు 2 జీబీ డేటా లభిస్తుంది. అంటే 28 రోజులకు గానూ 56 జీబీ డేటా వస్తుంది. ఏడో వార్షిక ఆఫర్ కింద 7 జీబీ డేటా అదనంగా పొందొచ్చు. అలాగే, 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.749 రీఛార్జిపై రోజుకు 2జీబీ డేటా, అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్లు లభిస్తాయి. సెప్టెంబరు 30లోగా ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసుకుంటే 14 జీబీ అదనపు డేటా పొందొచ్చు.
జియో మరో ప్లాన్ రూ.2,999 రీఛార్జితో 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అపరిమిత వాయిస్ కాల్స్, 100 ఎస్సెమ్మెస్లతో పాటు రోజుకు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912 జీబీ డేటా లభిస్తుంది. జియో ఏడేళ్ల వార్షిక ఆఫర్ లో భాగంగా మూడు 7జీబీ డేటా కూపన్లు ఇస్తున్నారు. అంటే 21 జీబీ అదనపు డేటా లభిస్తుంది. ఈ రీఛార్జిపై డేటాతో పాటు అదనంగా మెక్డొనాల్డ్స్, రిలయన్స్ డిజిటల్, యాత్ర, అజియో, నెట్మెడ్ కూపన్లు పొందొచ్చు.
=========================
0 Komentar