Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Cricket Fielding Positions – How Many & What Are Those - All the Details Here

 

Cricket Fielding Positions How Many & What Are Those - All the Details Here

క్రికెట్ ఫీల్డింగ్ - క్రికెట్‌లోని ఫీల్డింగ్ పొజిషన్లు ఎన్నో తెలుసా? వాటి పేర్లు ఏమిటి? 

====================

క్రికెట్‌లో ఫీల్డ్‌ను సాధారణంగా రెండు భాగాలుగా విభజిస్తారన్న సంగతి తెలిసిందే. అవి ఆఫ్‌సైడ్‌, ఆన్‌ లేదా లెగ్‌సైడ్‌. ఈ ఆఫ్‌, ఆన్‌ సైడ్లను బట్టి ఫీల్డింగ్‌ పొజిషన్లు మారుతుంటాయి.

కామెంట్రీ సమయం లో బ్యాటర్ బాల్‌ను కొట్టగానే ఆ బాల్‌ ఎక్కడికి వెళ్లిందో ఆ ఫీల్డింగ్‌ పొజిషన్‌ను ఠక్కున చెప్పేస్తారు. నిజానికి లైవ్‌లో ఇది అంత ఈజీ కాదు. ఎందుకంటే క్రికెట్‌ ఫీల్డ్‌లో 20 కంటే ఎక్కువ ఫీల్డింగ్ పొజిషన్స్‌ ఉంటాయి. ఫీల్డ్‌ను సాధారణంగా రెండు భాగాలుగా విభజిస్తారన్న సంగతి తెలుసు కదా. అవి ఆఫ్‌సైడ్‌, ఆన్‌ లేదా లెగ్‌సైడ్‌. ఈ ఆఫ్‌, ఆన్‌ సైడ్లను బట్టి ఫీల్డింగ్‌ పొజిషన్లు మారుతుంటాయి.

1893 లో ప్రచురించబడిన ఫీల్డింగ్ గురించిన ఫోటో 

====================

1. కీపర్‌: ఫీల్డ్‌లో అందరి కంటే ఎక్కువగా బంతిని అందుకునే ఫీల్డ్‌ పొజిషన్‌ ఇదే. సరిగ్గా బ్యాట్స్‌మన్‌ వెనుక గ్లోవ్స్‌, ప్యాడ్స్‌తో కనిపించే వ్యక్తే వికెట్‌ కీపర్‌.  

2. స్లిప్స్‌: వికెట్‌ కీపర్‌ పక్కనే ఉండే ఫీల్డింగ్‌ పొజిషన్‌ను స్లిప్‌ అంటారు. సాధారణంగా ఆఫ్‌సైడ్‌లో ఎక్కువగా కనిపించినా.. లెగ్‌సైడ్‌లోనూ ఒక్కోసారి ఉంటారు. దీనిని లెగ్‌స్లిప్‌ అంటారు. ముఖ్యంగా టెస్టుల్లో ఎక్కువ ఫీల్డర్లు స్లిప్స్‌లో ఉండటం చూస్తుంటాం.

3. థర్డ్‌మ్యాన్‌: ఆఫ్‌సైడ్‌లో స్లిప్స్‌ వెనుకాల బౌండరీ దగ్గర ఉండే ఫీల్డర్‌ను థర్డ్‌మ్యాన్‌ అంటారు. స్లిప్స్‌ను దాటి బౌండరీ వైపు వెళ్తున్న బాల్‌ను ఆపడమే ఇతని పని.

4. గల్లీ: 30 గజాల సర్కిల్‌ లోపల ఆఫ్‌సైడ్‌లో స్లిప్‌, పాయింట్‌ ఫీల్డర్‌ మధ్య ఉండే ఫీల్డింగ్‌ పొజిషన్‌ను గల్లీ అంటారు.

5. పాయింట్‌: ఫీల్డింగ్‌లో చాలా ముఖ్యమైన పొజిషన్లలో ఇదీ ఒకటి. సాధారణంగా చాలా వేగంగా, చురుగ్గా ఉండే టీమ్‌లోని బెస్ట్‌ ఫీల్డర్‌ ఇక్కడ ఉంటాడు. ఆఫ్‌సైడ్‌లో 30 గజాల సర్కిల్‌ లోపల బ్యాట్స్‌మన్‌ క్రీజుకు కాస్త వెనుకాల ఈ ఫీల్డర్‌ ఉంటారు.

6. కవర్‌: కవర్‌ పాయింట్‌, మిడాఫ్‌కు మధ్య నిల్చొనే ఫీల్డర్‌ను కవర్‌ అంటారు. క్రికెట్‌లోని ఫేమస్‌ షాట్లలో కవర్‌ షాట్‌ కూడా ఒకటన్న విషయం తెలుసు కదా. అందుకే కవర్స్‌లో నిలబడే ఫీల్డర్‌ కూడా ఉత్తమ ఫీల్డ్‌ అయి ఉండాలి.

7. ఎక్స్‌ట్రా కవర్‌: కవర్‌ పొజిషన్‌లో కాకుండా కాస్త జరిగి మిడాఫ్‌ ఫీల్డర్‌కు దగ్గరగా నిల్చొనే ఫీల్డర్‌ను ఎక్స్‌ట్రా కవర్‌ అంటారు.

8. మిడాఫ్‌: ఆఫ్‌సైడ్‌లో బౌలర్‌కు దగ్గరగా ఉండే ఫీల్డింగ్‌ పొజిషన్‌ను మిడాఫ్‌ అంటారు. ఇదే ఫీల్డర్‌ను 30 గజాల సర్కిల్‌ బయటకు అంటే బౌండరీ దగ్గరికి జరిపితే లాంగాఫ్‌ అంటారు. 

9. మిడాన్‌: ఆన్‌సైడ్‌లో బౌలర్‌కు దగ్గరగా ఉండే ఫీల్డరే మిడాన్‌. మిడాఫ్‌లాగే ఇక్కడ కూడా లాంగాన్‌, షార్ట్‌ మిడాన్‌, సిల్లీ మిడాన్‌ ఫీల్డింగ్‌ పొజిషన్లు ఉంటాయి.

10. మిడ్‌ వికెట్‌: మిడాన్‌ పక్కగా 30 గజాల సర్కిల్‌ లోపల ఉండే ఫీల్డర్‌ను మిడ్‌ వికెట్‌గా పిలుస్తారు.

11. స్క్వేర్‌లెగ్‌: బ్యాట్స్‌మన్‌ క్రీజుకు కాస్త వెనుకగా లెగ్‌సైడ్‌లో నిల్చొనే ఫీల్డర్‌ను స్క్వేర్‌లెగ్‌ ఫీల్డర్‌ అంటారు.

12. బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌: బ్యాక్‌వర్డ్ పాయింట్ ప్రతిబింబమే ఈ బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌ పొజిషన్‌ అని చెప్పొచ్చు.

13. ఫైన్‌ లెగ్‌: స్క్వేర్‌లెగ్‌ పొజిషన్‌ నుంచి వెనుకగా వికెట్‌ కీపర్‌ వైపు వెళ్తే ఫైన్‌ లెగ్‌ ఏరియా ప్రారంభమవుతుంది.

14. షార్ట్ లెగ్‌: ఆఫ్‌సైడ్‌లో సిల్లీ పాయింట్‌లాగే లెగ్‌సైడ్‌లో షార్ట్‌ లెగ్‌ ఫీల్డర్‌ ఉంటాడు.

15. ఆఫ్‌సైడ్‌లో స్లిప్‌, గల్లీలాగే ఆన్‌సైడ్‌లోనూ లెగ్‌ స్లిప్‌, లెగ్‌ గల్లీ ఫీల్డర్లు ఉంటారు.

====================

List of Fielding Positions

1. Wicket Keeper

2. First Slip

3. Second slip

4. Third Slip

5. Fly Slip

6. Long Stop

7. Third man

8. Gully

9. Deep Gully

10. Silly Point

11. Point

12. Deep Point

13. Cover Sweeper

14. Cover Point

15. Extra Cover

16. Deep Extra Cover

17. Silly Mid Off

18. Mid Off

19. Long Off

20. Straight Hit

21. Silly Mid On

22. Mid On

23. Long On

24. Forward Short Leg

25. Short Mid-Wicket

26. Mid-Wicket

27. Deep Mid-Wicket

28. Sweeper

29. Short Square Leg

30. Square Leg

31. Deep Square Leg

32. Leg Gully

33. Long Leg

34. Leg Slip

35. Short Fine Leg

36. Deep Fine Leg

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags