JEE Main 2024: All the Details Here
జేఈఈ మెయిన్-2024 - పూర్తి వివరాలు ఇవే
======================
జేఈఈ మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ
నుంచి, చివరి విడతను ఏప్రిల్ 1 నుంచి
ప్రారంభించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్డీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు
సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.
జాయింట్
ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024
అర్హత:
అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2022, 2023లో 12వ తరగతి/ తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు
హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) - 2024 పరీక్షకు హాజరు
కావచ్చు.
తొలి విడతను
వచ్చే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, చివరి విడత ఏప్రిల్ 1 నుంచి 15వ తేదీ వరకు జరుపుతామని ఎన్టీఏ
వెల్లడించింది. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్, బీ-ప్లానింగ్
కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్-2, మిగిలిన రోజుల్లో బీటెక్ సీట్ల భర్తీకి పేపర్-1 పరీక్ష నిర్వహిస్తారు. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి
రెండో వారంలో ప్రకటిస్తారు.
హాల్ టికెట్ల
ను జనవరి మూడో వారంలో వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. ఏప్రిల్లో జరిగే చివరి
విడతకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.
తెలుగు
రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు:
తెలంగాణ:
హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.
ఏపీ:
అమలాపురం,
అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపం పరే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి, తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.
పరీక్షలను
తెలుగు,
ఆంగ్లం సహా మొత్తం 13 భాషాల్లో
నిర్వహిస్తారు. ఇతర భాషల్లో హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం, ఒడియా, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంతోపాటు అభ్యర్థులు
కోరుకున్న ప్రాంతీయ భాషలోనూ ఇస్తారు. పేపర్-1 300 మార్కులకు, పేపర్-2 400 మార్కులకు ఉంటాయి.
పరీక్షలు
కంప్యూటర్ ఆధారంగా సాగుతాయి. బీఆర్క్ విద్యార్థులకు ఆఫ్లైన్ విధానంలో డ్రాయింగ్
పరీక్ష కూడా ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు:
సెషన్-1: జేఈఈ (మెయిన్) - జనవరి 2024:
ఆన్లైన్
దరఖాస్తు తేదీలు: 01-11-2023 నుంచి 30-11-2023 వరకు.
పరీక్ష
తేదీలు: 2024,
జనవరి నుంచి ఫిబ్రవరి 1 వరకు.
పరీక్ష
కేంద్రాల ప్రకటన: 2024, జనవరి రెండో వారం.
ఫలితాల
వెల్లడి: 12.02.2024.
సెషన్-2: జేఈఈ (మెయిన్) - ఏప్రిల్ 2024:
ఆన్లైన్
దరఖాస్తు తేదీలు: 02-02-2024 నుంచి 02-03-2024 వరకు.
పరీక్ష
తేదీలు: 2024,
ఏప్రిల్ 1 నుంచి 14 వరకు.
పరీక్ష
కేంద్రాల ప్రకటన: 2024, మార్చి మూడో వారం.
ఫలితాల
వెల్లడి: 25.04.2024.
======================
======================
0 Komentar