JioPhone Prima 4G Keypad Phone with YouTube,
WhatsApp, JioPay (UPI), Video Calling – Details Here
రిలయన్స్ జియో
ఫోన్ ప్రైమా 4జీ - యూట్యూబ్, జియో టీవీ, జియో పే, వాట్సాప్, ఫేస్ బుక్ ఫీచర్ల తో కొత్త ఫోన్ విడుదల – ధర వివరాలు ఇవే
=====================
రిలయన్స్
జియో తక్కువ ధరలో ఆకర్షణీయ ఫీచర్లతో ఇటీవల భారత్ సిరీస్ ఫోన్లను జియో తీసుకొచ్చిన
సంగతి తెలిసిందే. తాజాగా జియో ఫోన్ ప్రైమా 4జీ (Jio prima 4g) పేరిట మరో ఫోన్ ను లాంచ్ చేసింది. దీపావళి రోజు నుండి ఈ
ఫోన్ అందుబాటులోకి వచ్చింది రానుంది. దీని ధర రూ. 2599 గా నిర్దారించారు. అమెజాన్, జియో ఔట్లెట్
లలో ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.
జియో ఫోన్
ప్రైమా 4జీ ఫోన్ 2.4 అంగుళాల టీఎల్డీ
డిస్ప్లేతో పనిచేస్తుంది. ఫ్లాష్లైట్, కెమెరా
సదుపాయం ఉంది. 512 ఎంబీ ర్యామ్ అమర్చారు. మెమొరీ కార్డు
ద్వారా 128 జీబీ వరకు పొడిగించుకునే వీలుంది. KaiOSపై ఈ ఫోన్ పనిచేస్తుంది. ఆర్మ్ కోర్టెక్స్ ఏ53 ప్రాసెసర్ వస్తోంది. బ్లూటూత్ 5.0, 1800 ఎంఏహెచ్ బ్యాటరీ అమర్చారు. ఎఫ్ఎం రేడియో సదుపాయం
ఇస్తున్నారు.
యూట్యూబ్, జియో టీవీ, జియో సినిమా, జియో సావన్, జియో న్యూస్
వంటి యాప్స్ ప్రీ ఇన్స్టాల్డ్ వస్తున్నాయి. వాట్సాప్, ఫేస్బుక్ వంటి యాప్స్ ను వినియోగించుకోవచ్చు. జియో పే
ద్వారా యూపీఐ పేమెంట్స్ చేయొచ్చు. మొత్తం 23 భాషలకు సపోర్ట్ చేస్తుంది. దీపావళి సమయానికి అందుబాటు వివరాలు తెలుస్తాయి.
మరోవైపు జియో భారత్ పేరిట ఇటీవల కొన్ని ఫోన్లను జియో తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. వీటి ధరలు రూ.999 నుంచి ప్రారంభమవుతాయి. యూపీఐ సదుపాయంతో జియో భారత్ బీ1 4జీ ఫోన్ ను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీని ధరను రూ. 1299గా కంపెనీ నిర్ణయించింది. అమెజాన్, జియో ఔట్లెట్స్లో ఈ ఫోన్లను కొనుగోలు చేయొచ్చు.
=====================
CLICK
TO BUY PRIMA PHONE IN AMAZON
CLICK
TO BUY PRIMA PHONE IN JIO MART
=====================
0 Komentar