Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Australian Open-2024: Jannik Sinner Wins First Grand Slam – Beats Medvedev in Thrilling Final

 

Australian Open-2024: Jannik Sinner Wins First Grand Slam – Beats Medvedev in Thrilling Final

ఆస్ట్రేలియన్ ఓపెన్-2024: మొదటి గ్రాండ్ స్లామ్ విజేత గా ఇటలీ టెన్నిస్ ఆటగాడు జనిక్ సినర్

======================

2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా ఇటలీ టెన్నిస్ ప్లేయర్ జనిక్ సినర్ రికార్డు నమోదు చేశాడు. మొదటి రెండు సెట్లు కోల్పోయిన మిగిలిన మూడు సెట్లు అద్భుత పోరాటంతో గెలిచి తొలిసారి గ్రాండ్ స్లమ్ విజేత గా  సినర్ అవతరించాడు. 2024 ఆస్ట్రేలియన్ ఓపెన్ పురుషుల సింగిల్స్ విజేతగా నిలిచాడీ 22 ఏళ్ల ఆటగాడు.

సెమీస్ లో ప్రపంచ నంబర్ 2 ర్యాంకర్ నొవాక్ జకోవిచ్ కు చుక్కలు చూపించిన జనిక్ సినర్ ల్లోనూ అదే ఊపు ప్రదర్శించాడు. ఆరంభంలో ఒత్తిడికి గురై వెనుకబడినప్పటికీ.. పుంజుకుని టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. దాదాపు 3 గంటల 45 నిమిషాల పాటు సాగిన ఫైనల్ పోరులో రష్యా స్టార్ డానిల్ మెద్వెదేవ్ పై 3-6, 3-6, 6-4, 6-4, 6-3 తేడాతో జనిక్ విజయం సాధించాడు. ఆరంభంలో పెద్దగా పోరాడకుండానే తలొగ్గిన సినర్ ను మెద్వెదేవ్ తక్కువగా అంచనా వేశాడు. వరుసగా చివరి మూడు సెట్లను నెగ్గిన జనిక్ తొలి గ్రాండ్ స్లమ్ సొంతం చేసుకున్నాడు.

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags