Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Australian Open 2024 Men's Doubles Final: Rohan Bopanna Becomes Oldest Grand Slam Champion At 43

 

Australian Open 2024 Men's Doubles Final: Rohan Bopanna Becomes Oldest Grand Slam Champion At 43

ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల డబుల్స్ ఫైనల్: 43 ఏళ్ల వయసులో గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ గా రికార్డు సృష్టించిన రోహన్ బోపన్న

===================

రోహన్ బోపన్న చరిత్ర సృష్టించాడు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 డబుల్స్ విభాగంలో తన సహచరుడు ఎబ్డెన్ తో (ఆస్ట్రేలియా) కలిసి ఫైనల్లో ఇటలీ జోడీ సిమోన్-వావాసోరిపై విజయం సాధించాడు. కెరీర్లో తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. అతిపెద్ద వయసులో గ్రాండ్ స్లామ్ టైటిల్ నెగ్గిన టెన్నిస్ ప్లేయర్ గానూ  రోహన్ (43 ఏళ్లు) ఘనత సాధించాడు.

ఈ రోజు ఫైనల్లో సిమోన్ - వావాసోరి జోడీ నుంచి రోహన్ - ఎబ్డెన్ పోటీ ఎదురైంది. తొలి పాయింట్ నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మొదటి సెట్ ను 7-6 (7/0)తో రోహన్ జోడీ నెగ్గింది. ఇక రెండో సెట్లోనూ ఆటగాళ్లు విజయం కోసం నువ్వా నేనా? అన్నట్లు పోరాడారు. ఒక దశలో రోహన్ జోడీ 3-4తో వెనకబడినా పుంజుకుంది. మ్యాచ్ ఫలితం మూడో సెట్ కు వెళ్తుందా? అనే అనుమానం వచ్చింది. కానీ, రోహన్ ఎబ్డెన్ జోడీ అదరగొట్టేసింది. రెండో సెట్ ను 7-5 తేడాతో నెగ్గి ఆస్ట్రేలియన్ ఓపెన్ విజేతగా నిలిచింది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం రోహనకు 'పద్మ' పురస్కారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

తొలిసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ ను గెలిచిన రోహన్ బోపన్న 2017లో మిక్స్డ్ డబుల్స్ లో ఫ్రెంచ్ ఓపెన్ విజేతగా నిలిచాడు. పురుషుల విభాగంలో లియాండర్ పేస్, మహేశ్ భూపతి తర్వాత గ్రాండ్ స్లామ్ నెగ్గిన మూడో భారత ఆటగాడు రోహన్ బోపన్న. మహిళల విభాగంలో సానియా మీర్జా గ్రాండ్ స్లామ్ ను నెగ్గింది. దాదాపు 60 సార్లు గ్రాండ్లమ్స్ పోటీపడగా.. తొలిసారి ఇప్పుడు రోహన్ విజేతగా నిలిచాడు. ఇది కూడా ఒక రికార్డే.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags