Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Indian General Election 2024: All the Details Here

 

Indian General Election 2024: All the Details Here

భారత సార్వత్రిక ఎన్నికలు 2024: పూర్తి వివరాలు ఇవే

=====================

UPDATE 18-04-2024

ఎన్నికల నోటిఫికేషన్ విడుదల

నేటి (ఏప్రిల్ 18) నుంచి ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం

సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ) నోటిఫికేషన్ వెలువడింది. ఏపీ, ఒడిశా, అరుణాచలప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలు సహా 10 రాష్ట్రాల్లో లోక్ సభ న్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. నాలుగో విడతలో లోక్ సభ ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, ఝార్ఖండ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, ఉత్తర్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీర్ ఉన్నాయి. వీటిలో మొత్తం 96 లోక్ సభ స్థానాల్లో నాలుగో దశలో ఎన్నికలు జరగనున్నాయి.

నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో నేటి నుంచి ఏపీ, తెలంగాణ సహా ఆయా రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈనెల 25 వరకు నామినేషన్ల స్వీకరణ చేపట్టి.. 26న పరిశీలించనున్నారు. 29 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

CLICK FOR NOTIFICATION

=====================

2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ నేడు (మార్చి 16) విడుదల అయింది. లోక సభ తో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచలప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తేదీలను కేంద్ర ఎన్నికల సంఘం శనివారం వెల్లడించింది. మొత్తం ఏడు దశల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఏప్రిల్ 19న తొలి విడత పోలింగ్ జరగనుంది. ఆంధ్రప్రదేశ్ కు మే 13వ తేదీన ఒకే విడతలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి అన్ని ఫలితాలను వెల్లడించనున్నారు.

ఏపీ, తెలంగాణలో ఒకే రోజున లోక్ సభ పోలింగ్

తెలుగు రాష్ట్రాల్లో ఒకే రోజున లోక్సభ ఎన్నికలు నిర్వహించనున్నారు. నాలుగో విడతలో భాగంగా మే 13వ తేదీన ఏపీలోని 25, తెలంగాణలోని 17 ఎంపీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. అదే రోజున ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు నిర్వహించనున్నారు.

CLICK FOR DETAILED NOTIFICATION

=====================

2024 సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ శనివారం (మార్చి 16) విడుదల కానుంది. మార్చి 16 మధ్యాహ్నం 3 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించి షెడ్యూల్ ను ప్రకటించనుంది. ఈ మేరకు ఈసీ నేడు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా వెల్లడించింది.

లోక్ సభ తో పాటుగానే.. ఆంధ్రప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. ప్రస్తుత లోక్ సభకు జూన్ 16వ తేదీతో గడువు ముగియనుంది. దీంతో పాటు ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచలప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది.

ఏప్రిల్- మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది.

=====================

REFERENCE:

Voter Helpline APP

CLICK HERE

=====================

Voter ID - All Voter Related Websites - AP, TS & Central EC

CLICK HERE

=====================

Previous
Next Post »
0 Komentar

Google Tags