Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

UGC-NET-JUNE 2024: All the Details Here

 

UGC-NET-JUNE 2024: All the Details Here 

యూజీసీ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ - జూన్ 2024 – పూర్తి వివరాలు ఇవే

=======================

UPDATE 20-06-2024

UGC-NET-JUNE 2024: పరీక్ష రద్దు – విద్యా శాఖ నిర్ణయం

జూన్ 18న నిర్వహించిన యూజీసీ నెట్ -2024 (UGC NET-2024) పరీక్ష రద్దు చేసింది. దేశంలోని యూనివర్సిటీల్లో లెక్చరర్షిప్ (అసిస్టెంట్ ప్రొఫెసర్), జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్డ్ లలో ప్రవేశాలకు కోసం జరిగే ఈ పరీక్షను మళ్లీ నిర్వహించాలని నిర్ణయించింది. యూజీసీ నెట్ పరీక్షలో అవకతవకలు జరిగినట్టు యూజీసీ నిర్ధారణ మేరకు నిర్ణయం తీసుకుంది.

దేశవ్యాప్తంగా మంగళవారం (JUNE 18) 1,205 సెంటర్లలో జరిగిన ఈ పరీక్షకు దాదాపు 9లక్షల మందికిపైగా అభ్యర్థులు హాజరయ్యారు. పరీక్షల్లో పారదర్శకతను కాపాడుకోవడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ తెలిపింది. ఈ పరీక్షలో అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని నిర్ణయించింది. పరీక్షల పారదర్శకతకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర విద్యాశాఖ స్పష్టం చేసింది.

=======================

UPDATE 15-06-2024

UGC-NET-JUNE 2024: పరీక్ష అడ్మిట్ కార్డులు విడుదల

పరీక్ష తేదీ: 18/06/2024  

DOWNLOAD ADMIT CARDS

WEB NOTE ON ADMIT CARDS

WEBSITE

=======================

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024 (యూజీసీ- నెట్) పరీక్షకు షెడ్యూల్ విడుదలైంది. జూనియర్ రిసెర్చి ఫెలోషిప్, విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీపడేందుకు ఉపయోగపడే ఈ పరీక్షను జూన్ లో  నిర్వహించనున్నట్టు యూజీసీ వెల్లడించింది. మొత్తం 83 సబ్జెక్టులకు నిర్వహించే కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహణ బాధ్యతను జాతీయ పరీక్షల మండలికి అప్పగించింది.  

యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ జూన్ 2024

సబ్జెక్టులు: అడల్ట్ ఎడ్యుకేషన్, ఆంథ్రోపాలజీ, అరబ్ కల్చర్ అండ్ ఇస్లామిక్ స్టడీస్, అరబిక్, ఆర్కియాలజీ, అస్సామీ, బెంగాలీ, బోడో, బౌద్ధ, జైన, చైనీస్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ అండ్, క్రిమినాలజీ తదితరాలు.

అర్హత: 55% మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి: జేఆర్ఎఫ్ కు 01.06.2024 నాటికి 30 ఏళ్లు మించకూడదు. అసిస్టెంట్ ప్రొఫెసర్ కు గరిష్ఠ వయోపరిమితి లేదు.

పరీక్ష విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష(సీబీటీ) విధానంలో ఉంటుంది. పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. రెండు పేపర్లలో ఆబ్జెక్టివ్ టైప్, మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్-1లో 50 ప్రశ్నలు... 100 మార్కులు, పేపర్-2లో 100 ప్రశ్నలు 200 మార్కులు కేటాయించారు. పరీక్షకు 3 గంటల వ్యవధి ఉంటుంది.

దరఖాస్తు రుసుము: జనరల్/ అన్రిజర్వ్డ్ కు రూ. 1150; జనరల్ - ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ- ఎన్సీఎల్ రూ.600; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, థర్డ్ జెండర్ కు రూ.325.

ముఖ్యమైన తేదీలు:  

ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం: 20-04-2024.

ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 10-05-2024.

పరీక్ష తేదీ: 16-06-2024

=======================

INFORMATION BULLETIN

APPLY HERE

PUBLIC NOTICE

WEBSITE

=======================

Previous
Next Post »
0 Komentar

Google Tags