Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Central Bank of India Recruitment 2024: Apply for 253 Specialist Officer Posts - Details Here

 

Central Bank of India Recruitment 2024: Apply for 253 Specialist Officer Posts - Details Here

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 253 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులు - పే స్కేల్: రూ.48,480 – రూ.1,20,940

======================

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యూమన్ క్యాపిటల్ మేనేజ్మెంట్ (రిక్రూట్మెంట్ & ప్రమోషన్), సెంట్రల్ ఆఫీస్... రెగ్యులర్ ప్రాతిపదికన సీబీఐ శాఖల్లో వివిధ స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హులైన అభ్యర్థులు డిసెంబర్ 3వ తేదీలోగా ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

వివరాలు:

స్పెషలిస్ట్ ఆఫీసర్: 253 పోస్టులు (ఎస్సీ- 37; ఎస్టీ- 18; ఓబీసీ- 68; ఈడబ్ల్యూఎస్- 25; జనరల్ - 105)

కేటగిరీ వారీగా ఖాళీలు:

1. చీఫ్ మేనేజర్స్ ఇన్ సీనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-IV: 10 పోస్టులు

2. చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-III: 56 పోస్టులు

3. చీఫ్ మేనేజర్స్ ఇన్ మిడిల్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-II: 162 పోస్టులు

4. చీఫ్ మేనేజర్స్ ఇన్ జూనియర్ మేనేజ్మెంట్ గ్రేడ్ స్కేల్-I: 25 పోస్టులు

జాబ్ రోల్: జావా డెవలపర్, మొబైల్ డెవలపర్, కోబాల్ డెవలపర్, డాట్ నెట్ డెవలపర్, డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, డేటా ఇంజినీర్/ అనలిస్ట్, డేటా సైంటిస్ట్, సైబర్ సెక్యూరిటీ అనలిస్ట్, ఐటీ ఆఫీసర్స్, వెబ్ సర్వర్ అడ్మినిస్ట్రేటర్, కంటెంట్ మేనేజర్ తదితరాలు .

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బ్యాచిలర్స్/ మాస్టర్స్ డిగ్రీ, బీఈ, బీటెక్, ఎంసీఏ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: స్కేల్-IV పోస్టులకు 34- 40 ఏళ్లు; స్కేల్-III పోస్టులకు 30- 38 ఏళ్లు; స్కేల్-II ఖాళీలకు 27- 33 ఏళ్లు; స్కేల్-I ఖాళీలకు 23- 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్: స్కేల్-IV పోస్టులకు రూ.1,02,300 - 1,20,940; స్కేల్-III పోస్టులకు రూ.85,920- రూ.1,05,280; స్కేల్-II పోస్టులకు రూ.64,820 - రూ.93,960; స్కేల్-1 పోస్టులకు రూ.48,480 - రూ.85,920 వేతనం ఉంటుంది.

పోస్టింగ్ స్థలం: ముంబయి/ నవీ ముంబయి/ హైదరాబాద్.

ఎంపిక విధానం: ఆన్లైన్ ప్లాట్ఫాం టెస్ట్/ సినారియో బేస్డ్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ .850, జీఎస్టీ(ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.175, జీఎస్).

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం: 18.11.2024

ఆన్లైన్ రిజిస్ట్రేషను చివరి తేదీ: 03.12.2024.

ఆన్లైన్ పరీక్ష తేదీ: 14.12.2024

======================

NOTIFICATION

APPLY HERE

CAREER PAGE

WEBSITE

======================

Previous
Next Post »
0 Komentar

Google Tags