AP PGCET-2025:
All the Details Here
ఏపీ పీజీ
సెట్ 2025:
పూర్తి వివరాలు ఇవే
=====================
UPDATE 08-09-2025
AP PGCET 2025: పీజీ ప్రవేశాల కౌన్సెల్లింగ్ షెడ్యూల్ విడుదల
కౌన్సెల్లింగ్
షెడ్యూల్ ఇదే:
రిజిస్ట్రేషన్
తేదీలు: 08-09-2025 నుండి 15-09-2025 వరకు
ధ్రువపత్రాల
పరిశీలన: 09-09-2025 నుండి 16-09-2025 వరకు
వెబ్ ఆప్షన్ల
తేదీలు: 12-09-2025 నుండి 17-09-2025 వరకు
ఐచ్ఛికాల
మార్పు: 18-09-2025
సీట్ల
కేటాయింపు: 20-09-2025
సెల్ఫ్
రిపోర్టింగ్ తేదీలు: 22-09-2025 నుండి 24-09-2025 వరకు
తరగతుల
ప్రారంభం: 22-09-2025 నుండి
=====================
UPDATE
25-06-2025
AP PGCET 2025: ఫలితాలు విడుదల – డౌన్లోడ్ ర్యాంక్
కార్డ్
=====================
UPDATE 13-06-2025
AP PGCET 2025: ప్రిలిమినరీ ‘కీ’లు విడుదల
MASTER QP
WITH PRELIMINARY KEYS
=====================
UPDATE
30-05-2025
AP PGCET-2025:
పరీక్ష హాల్ టికెట్లు విడుదల
పరీక్ష తేదీలు: 09/06/2025 నుండి 12/05/2025 వరకు
=====================
ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ
కళాశాలల్లో పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించే
పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2025 (ఏపీ పీజీసెట్) షెడ్యూలును ఏపీ ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. ఆన్లైన్
దరఖాస్తు ప్రక్రియ ఏప్రిల్ 2న ప్రారంభం కానుంది.
ప్రవేశ పరీక్షలు జూన్ 9న ప్రారంభం అయ్యి జూన్ 13న వరకు జరుగును.
పోస్ట్
గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ - 2025 (ఏపీ పీజీసెట్)
పీజీ
కోర్సులు: ఎంఏ, ఎంకాం, ఎంఎస్సీ, ఎంసీజే, ఎంఎల్ఎస్ఐబీఎస్సీ, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎస్సీటెక్
తదితరాలు.
అర్హత:
సంబంధించిన సబ్జెక్టులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత లేదా చివరి ఏడాది పరీక్ష
రాస్తున్నవారు అర్హులు.
పరీక్ష ఫీజు:
జనరల్ కేటగిరీలకు రూ.850; బీసీలకు రూ.750; ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.650.
పరీక్ష
విధానం: లాంగ్వేజ్ స్పెషలైజేషన్ పేపర్లు మినహా మిగతా అన్ని ప్రశ్న పత్రాలు
ఇంగ్లిష్ మాధ్యమంలో ఉంటాయి. పరీక్ష కంప్యూటర్ ఆధారంగా ఆన్లైన్ విధానంలో
నిర్వహిస్తారు. ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ పద్ధతిలో ఉంటుంది. పరీక్ష 90 నిముషాల వ్యవధితో 100 మార్కులకు జరుగుతుంది. నెగెటివ్ మార్కులు లేవు. అభ్యర్ధి దరఖాస్తు చేసుకున్న
సబ్జెక్టు సంబంధించి డిగ్రీ సిలబస్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
ముఖ్యమైన
తేదీలు:
దరఖాస్తుల
ప్రారంభ తేదీ: 02-04-2025
దరఖాస్తులకి చివరి తేదీ: 11-05-2025
హాల్ టికెట్లు డౌన్లోడ్ తేదీ: 30-05-2025
పరీక్షల
తేదీలు: 09-06-2025 నుండి 13-06-2025 వరకు
=====================
=====================


0 Komentar