BMW C 400 GT Launched – Specification &
Price Details Here
బీఎండబ్ల్యూ
నుంచి కొత్త డిజైన్ లో సీ400 జీటీ – ధర & ఫీచర్ల
వివరాలు ఇవే
====================
BMW ద్విచక్ర వాహన తయారీ సంస్థ బీఎండబ్ల్యూ మోటారాడ్ ఇండియా దేశీయ విపణిలోకి కొత్త
స్కూటర్ ను తీసుకొచ్చింది. ఆధునికీకరించిన బీఎండబ్ల్యూ సీ400 జీటీ (BMW C400 GT) మోడల్ ను విడుదల చేసింది. దీని ధరను రూ.11 లక్షలుగా (ఎక్స్- షోరూమ్) నిర్ణయించింది. భారత్లో
విక్రయిస్తున్న అత్యంత ఖరీదైన స్కూటర్లతో ఇది ఒకటి. పాత మోడల్ తో పోలిస్తే కొత్త
హంగులు జోడించి, సరికొత్త ఫీచర్లతో దీన్ని
తీసుకొచ్చినట్లు కంపెనీ తెలిపింది.
2025 బీఎండబ్ల్యూ సీ400 జీటీ.. 350 సీసీ లిక్విడ్- కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఇచ్చారు.
ఇది 7,500
rpm వద్ద 34hp శక్తిని, 5,750rpm వద్ద 35Nm పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. గరిష్ఠంగా గంటకు 129 కిలోమీటర్ల వేగంతో వెళుతుందని కంపెనీ పేర్కొంది. స్కూటర్
ముందు వైపు 4.5 లీటర్ల స్పేస్ ఇస్తున్నారు. ఇక సీటు
కింద మరో 37.6 లీటర్ల ఖాళీ స్థలం ఉంటుంది. 10.25 అంగుళాల టీఎఫీ డిస్ప్లేతో వస్తోంది. నావిగేషన్, మీడియా, స్మార్ట్ఫోన్
కనెక్టివిటీ సదుపాయాలు ఉన్నాయి. స్కూటర్ ఎడమవైపు ఉన్న కంపార్ట్ మెంట్ ఛార్జింగ్
యూనిట్ ఉంటుంది. దీని సాయంతో మీ స్మార్ట్ఫోన్ను ఛార్జ్ చేయొచ్చు. ఇది యూఎస్బీ
టైప్-సి,
12v పోర్ట్స్ ఉన్నాయి. ఇక లీన్ సెన్సిటివ్ బ్రేకింగ్
అసిస్టెన్స్, డైనమిక్ బ్రేక్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఏబీఎస్ ఫీచర్లు ఉన్నాయి. సీవీటీ
ట్రాన్స్ మిషన్ ఆప్షన్ తో వస్తోంది.
====================
====================
0 Komentar