AP: Update on Welfare
Schemes like Talliki Vandhanam, Annadhata Shukheebhava, Deepam & Free Bus
ఏపీ: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, దీపం & ఉచిత బస్సు వంటి సంక్షేమ పథకాలపై అప్‌డేట్
ఇదే
====================
UPDATE
17-05-2025
ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభ తేదీ ఇదే
> ఆంధ్ర ప్రదేశ్ లోని మహిళలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం
సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుయం కల్పిస్తామని సీఎం
చంద్రబాబు తెలిపారు.
> కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర
కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని
ప్రజలతో ప్రమాణం చేయించారు.
> రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి
చేశారు.
> ప్రతి నెలా మూడో శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు.
> ఉద్యోగులు కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై
దృష్టి పెట్టాలన్నారు.
====================
> తల్లికి
వందనం, అన్నదాత సుఖీభవ పథకాలు జూన్ 12న ప్రారంభించాలని నిర్ణయం.
> ముందుగానే
దీపం పథకం నగదు చెల్లింపులు. లబ్ధిదారుల ఖాతాల్లో సిలిండర్ బుకింగ్ కంటే ముందే
నగదు చెల్లించాలని నిర్ణయం.
> ఏడాదిలో
3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించాలని నిర్ణయం.
> లబ్ధిదారులు
సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, సిలిండర్
తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి
ఖాతాల్లో వేసేలా నిర్ణయం.
> ప్రతి
నెలా సంక్షేమం అందేలా ఏడాదికి సరిపడా సంక్షేమ క్యాలెండర్ విడుదలకు నిర్ణయం.
> జూన్
12న ప్రభుత్వం ఏర్పడి ఏడాది అవుతున్న సందర్భంగా లక్ష మంది
ఒంటరి మహిళలు, వితంతువులకు ఫించన్లు ఇవ్వాలని
నిర్ణయం.
> లక్ష
మంది ఒంటరి మహిళలు, వితంతువులకు గత
ప్రభుత్వం నిలుపుదల చేసిన ఫించన్లు పునరుద్ధరించాలని నిర్ణయం.
> మహిళలకు
ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభించేలా చర్యలకు నిర్ణయం.
====================

0 Komentar