Neeraj Chopra’s Cross 90m Mark: Javelin
Star Records Personal Best Throw in Doha Diamond League 2025
దోహా డైమండ్
లీగ్ 2025లో 90 మీటర్ల మార్క్ ని దాటిన
జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా
జావెలిన్
త్రో ప్లేయర్ నీరజ్ చోప్రా మరోసారి చరిత్ర సృష్టించాడు. తొలిసారి తన కెరీర్ లో 90 మీటర్ల మార్క్ ను అధిగమించాడు. ఖతార్ వేదికగా జరుగుతున్న దోహా
డైమండ్ లీగ్ మూడో రౌండ్ లో ఈటెను 90.23 మీటర్లు విసిరి ఈ ఘనత అందుకున్నాడు. ఇప్పటి వరకు నీరజ్ అత్యుత్తమ ప్రదర్శన 89.94 మీటర్లు. 2022లో స్టాక్ హోమ్ డైమండ్ లీగ్ లో నీరజ్ ఈ ప్రదర్శన చేశాడు.
ఈ లీగ్ లో
ఫేవరెట్ గా బరిలోకి దిగిన నీరజ్ అందుకు తగినట్లుగానే మంచి ఆరంభం అందించాడు. మొదటి
రౌండ్లోనే 88.84 మీటర్లు విసిరాడు. రెండో రౌండ్లోనూ
బాగానే విసిరినా.. అది ఫౌల్ అయింది. ఇక మూడో రౌండ్ లో తన కెరీర్ బెస్ట్ ను అందించాడు.
ఏకంగా 90+
మీటర్లు విసరడం విశేషం. అయితే జర్మనీ ప్లేయర్ జులియన్ వెబర్
(91.06
మీటర్లు) చివరి రౌండ్లో అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. దీంతో
నీరజ్ రెండో స్థానంతో సరిపెట్టుకున్నాడు.




0 Komentar