Rare Record in Cricket: UAE Women Retired
All 10 Batters – Check the Reason Here
క్రికెట్‌లో
అరుదైన రికార్డు: యుఎఇ మహిళల జట్టు 10 మంది
బ్యాట్స్‌మెన్‌లూ రిటైర్ అయ్యారు – జట్టు విజయం కోసమే ఆ నిర్ణయం – వివరాలు ఇవే
====================
టీ20 మహిళల ప్రపంచకప్ ఆసియా క్వాలిఫయర్స్ లో భాగంగా శనివారం (మే
10) యూఏఈ- ఖతార్ మధ్య మ్యాచ్ లో విచితం జరిగినది.
యూఏఈ జట్టులో పది మంది బ్యాటర్లు రిటైర్డ్ ఔట్ గా వెనుదిరిగారు. వర్షం అంతరాయం
కలిగించిన ఈ మ్యాచ్ లో మొదట యూఏఈ 16 ఓవర్లకు 192/0తో నిలిచింది. ఓపెనర్లు ఈషా ఓజా (113; 55 బంతుల్లో 14×4, 5×6), తీర్థ సతీష్
(74;
42 బంతుల్లో 11x4) మెరుపు ఇన్నింగ్స్ లు ఆడారు.
టెస్ట్ ల్లో తప్ప ODI & T20 లో ఏ జట్టు అయిన డిక్లేర్ చేసే వీలు లేదు. అందుకే వర్షం ముప్పు నేపథ్యంలో ప్రత్యర్థి జట్టు ని ఓడించటానికి ఆ స్కోరు చాలనుకున్న యూఏఈ.. పది మంది బ్యాటర్లను రిటైర్ చేసి ఇన్నింగ్స్ ను ముగించింది. మిచెల్లీ బోథా (3/11), కేటీ థాంప్సన్ (2/6) సహా యూఏఈ బౌలర్లందరూ అదరగొట్టడంతో ఖతార్ 11.1 ఓవర్లలో కేవలం 29 పరుగులకే ఆలౌటైంది. దీంతో యూఏఈ ఏకంగా 163 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఖతార్
ఇన్నింగ్స్ లో ఏడుగురు డకౌటయ్యారు. రిటైర్డ్ ఔట్ కావడం వల్ల యూఏఈ ఇన్నింగ్స్లోనూ 8 మంది డకౌటైనట్లు అయింది. దీంతో మ్యాచ్లో మొత్తం డకౌట్ల
సంఖ్య 15కు చేరుకుంది. ఇది ప్రపంచ రికార్డు. పురుషులు, మహిళల క్రికెట్ తో కలిపి అంతర్జాతీయ స్థాయిలో ఇద్దరికి మించి
రిటైర్డ్ ఔట్ అయిన దాఖలాలు లేవు. ఏకంగా పది రిటైర్డ్ ఔట్లతో యూఏఈ రికార్డు
నెలకొల్పింది.
====================
====================



0 Komentar