Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Helmet, Seat Belt, Fines or Traffic Police Fear - This Incident in Mumbai Is an Example of Safety While Travelling

 

Helmet, Seat Belt, Fines or Traffic Police Fear - This Incident in Mumbai Is an Example of Safety While Travelling

హెల్మెట్, సీట్ బెల్ట్ మన కోసమా, ఫైన్ పడిద్దనా లేదా ట్రాఫిక్ పోలీస్ ల మీద భయం తోనా – ప్రయాణం లో బద్రత గురించి ముంబై లో జరిగిన ఈ సంఘటన ఒక ఉదాహరణ  

===================

ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి పోలీసులు అప్రమత్తం చేస్తూనే ఉంటారు. ఈ క్రమంలో దంపతులు వెళ్తున్న కారును ఆపిన విధుల్లో ఉన్న ఓ ట్రాఫిక్ కానిస్టేబుల్ కూడా అందులోని మహిళకు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించాడు. ఆ మేరకు మహిళ అలాగే చేసింది. కొద్ది దూరం వెళ్లిన ఆ కారు అదుపుతప్పి తీవ్ర ప్రమాదానికి గురయ్యింది. భర్తకు స్వల్ప గాయాలవగా.. ఆమె మాత్రం చిన్న గాయం లేకుండా ప్రాణాలతో బయటపడింది. ఈ ఘటన ఇటీవల ముంబయిలో చోటుచేసుకుంది.


గౌతమ్ రోహ్రా, ఆయన సతీమణితో కలిసి శనివారం (జులై 26) సాయంత్రం ఇంటికి బయలుదేరారు. ఆ సమయంలో భారీ వర్షం కురుస్తోంది. రోహ్రా సీటు బెల్టు పెట్టుకున్నప్పటికీ పక్క సీట్లో ఉన్న ఆయన భార్య మాత్రం ధరించలేదు. బాంద్రా ఈస్ట్ లోని  కాలానగర్ వద్దకు రాగానే అక్కడ విధులు నిర్వర్తిస్తున్న ప్రవీణ్ క్షీరసాగర్ అనే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఈ విషయాన్ని గమనించాడు. కారు ఆపి సీటు బెల్టు ధరించాలని, లేదంటే రూ.1000 జరిమానా పడుతుందన్నాడు. వీటికంటే ముఖ్యంగా ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణాలు కాపాడతాయని సూచించాడు. ఆయన సూచన మేరకు ఆమె సీటు బెల్టు ధరించడంతో జరిమానా విధించకుండానే కానిస్టేబుల్ వారిని పంపించాడు.

అలా ముందుకు సాగిన ఆ దంపతులు కారు.. అంధేరీ ఫ్లైఓవర్ పై భారీ ప్రమాదానికి గురైంది. డివైడర్ ను ఢీకొని రెండు పల్టీలు కొట్టింది. వెంటనే అక్కడున్న ఓ పోలీస్ తోపాటు కానిస్టేబుల్ వారిని బయటకు తీశారు. భర్తకు స్వల్ప గాయాలు కాగా.. ఆయన సతీమణికి చిన్న గీత కూడా పడకుండా బయట పడ్డారు. సీటు బెల్టు పెట్టుకోవాలని 15 నిమిషాల క్రితం కానిస్టేబుల్ చేసిన సూచన తమ ప్రాణాలను రక్షించిందని గ్రహించారు. అతడిని కలిసి కృతజ్ఞత కూడా తెలియజేశారు. సీటు బెల్టు ప్రాముఖ్యతను వివరిస్తూ ముంబయి పోలీసులు కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

===================

Previous
Next Post »
0 Komentar

Google Tags