Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

AP Cabinet Meeting Highlights - 13/03/2026


AP Cabinet Meeting Highlights - 13/03/2026

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు ఇవే - 13/03/2026

====================

Cabinet Decisions - Press Briefing by Sri. Kolusu Parthasarathy, Hon'ble Minister for Information and Public Relations, Housing at Publicity Cell, Block-04, AP Secretariat on 13-03-2026 LIVE

ఏపీ క్యాబినెట్ మీటింగ్ గురించి ప్రెస్ మీట్ ప్రత్యక్ష ప్రసార వివరాలు ఇవే

YouTube Link:

https://www.youtube.com/watch?v=rfcLI6s-fyw


====================

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను సమావేశం అనంతరం మంత్రి పార్థసారథి ప్రెస్ మీట్ లో వివరించారు.

కేబినెట్ నిర్ణయాలు ఇవే:

> సచివాలయం, హెచ్డీ టవర్ల నిర్మాణాలకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

> మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనుల కోసం రూ.2,316 కోట్లకు

పరిపాలనా అనుమతులిచ్చింది.

> అమరావతి అభివృద్ధి, ఉపాధి సృష్టి, జలవనరులు, వ్యవసాయం, పరిశ్రమలు, పర్యాటకం, విద్యుత్ అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకుంది.

> సీఆర్డీఏ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.

> రూ.119 కోట్ల వ్యయంతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి ఆమోదం

> రాజధాని అమరావతిలో వివిధ సంస్థలకు భూకేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం ప్రతిపాదనలకు ఆమోదం.

> 300 మంది హెడ్ కానిస్టేబుల్ పోస్టులను రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులుగా అప్గ్రేడ్ ప్రతిపాదనకు ఆమోదం.

> చిన్న పరిశ్రమలకు ఊతమిస్తూ దాదాపు 17వేలమందికి ఉపాధి లభించేలా చర్యలు

> 3,500 సూక్ష్మ పరిశ్రమలకు రూ.300 కోట్లు ఆర్థిక వనరులు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

> FRA పట్టాదారులకు రాయితీలు కల్పించే ప్రతిపాదనలకు ఆమోదం.

> మిషన్ శక్తి కింద 'సఖీ నివాస్' పేరుతో పనిచేసే మహిళల కోసం క్రెచ్ సౌకర్యాలతో హాస్టళ్లు తిరుపతి, విజయవాడ, విశాఖ అప్పీల్ కార్యాలయాల పరిధిపై నిర్ణయం

> ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట గెజిట్ కు ఆమోదం.

> పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్ లో పోలవరం, మార్కాపురం జిల్లాలు చేర్చే ప్రతిపాదనలను కేంద్రానికి పంపే అజెండాకు అమోదం.

> పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్స్ అదనపు గ్రానైట్ కొనుగోలు, లైనింగ్ పనులకు రూ.23.47 కోట్లు కేటాయింపు.

> పోలవరం ప్యాకేజ్-64 పనులకు రూ.24.51 కోట్లు మంజూరుకు అనుమతి.

> ధవళేశ్వరం ఇరిగేషన్ సర్కిల్లో అత్యవసర మరమ్మతు పనులకు నిధుల మంజూరు.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags