Wimbledon Men’s
Final 2025: Jannik
Sinner defeats Carlos Alcaraz for First Wimbledon Title – Total 4
Grand Slam Titles
వింబుల్డన్ పురుషుల
సింగిల్స్ ఫైనల్ 2025: తొలి వింబుల్డన్
టైటిల్ & నాలుగవ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న ఇటలీ క్రీడాకారుడు
యానిక్ సినర్
====================
నెల క్రితం ఫ్రెంచ్
ఓపెన్ ఫైనల్లో అయిదున్నర గంటలు పోరాడారు కార్లోస్ అల్కరాస్-యానిక్ సినర్. ఫ్రెంచ్
ఓపెన్ అల్కరాస్ గెలిచాడు.ఈ సారి సినర్ దూకుడు ముందు అల్కరాస్ పోరాటం సరిపోలేదు.
దీంతో ఆల్ ఇంగ్లాండ్ క్లబ్ లో హ్యాట్రిక్ సాధించాలనుకున్న ఈ స్పెయిన్ స్టార్ కల
చెదిరింది. పచ్చగడ్డిలో అదరగొట్టిన యానిక్ సినర్ తొలి వింబుల్డన్ టైటిల్ ను ముద్దాడాడు.
గత రెండేళ్లలో అల్కరాస్ పై సినర్ కు ఇదే
తొలి విజయం. అతడికిది నాలుగో గ్రాండ్ స్లామ్ టైటిల్. దీంతో ఫైనల్ చేరిన ప్రతిసారీ
టైటిల్ గెలిచిన అల్కరాస్ రికార్డు చెదిరింది.
దూకుడుకి
ఆధిపత్యాన్ని జోడిస్తూ అదరగొట్టేసిన ప్రపంచ నంబర్ వన్ యానిక్ సినర్ (ఇటలీ)
టోర్నీలో కొత్త ఛాంపియన్ గా అవతరించాడు. ఫైనల్లో టాప్సీడ్ సినర్ 4-6, 6-4, 6-4,
6-4తో రెండోసీడ్ అల్కరాస్ ను ఓడించాడు. తొలి సెట్
ఆరంభంలో సినర్ దూకుడుగా ఆడాడు. అయిదో గేమ్ బ్రేక్ సాధించిన అతడు.. 4-2తో సెట్ దిశగా సాగాడు. కానీ అల్కరాస్ పుంజుకున్నాడు. బలమైన
బేస్ లైన్ ఆటతో అదరగొట్టాడు. డ్రాప్ షాట్లు, క్రాస్
కోర్టు విన్నర్లతో పాయింట్లు సాధించాడు. ఎనిమిదో గేమ్ సినర్ సర్వీస్ బ్రేక్ చేసిన
ఈ స్పెయిన్ స్టార్ 4-4తో స్కోరు సమం
చేశాడు. తర్వాత పదో గేమ్ మరోసారి బ్రేక్ సాధించి సెట్ ను గెలుచుకున్నాడు.
ఆ తర్వాత
రెండు సెట్లలో సినరే ఆధిపత్యం ప్రదర్శించాడు. అల్కరాస్ అంత తేలిగ్గా లొంగకపోయినా
కీలక సమయాల్లో బ్రేక్లు సాధించి వరుసగా రెండు సెట్లు గెలిచాడు. రెండో సెట్ తొలి
గేమ్ నే అల్కరాస్ సర్వీస్ ను బ్రేక్ చేసిన సినర్ 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే జోరుతో తేలిగ్గా సెట్ గెలిచాడు. మూడో సెట్ కూడా
హోరాహోరీ సాగింది. సర్వీస్ కోల్పోకూడదని ఇద్దరూ పట్టుదలగా ఆడారు. దీంతో స్కోరు 4-4తో అయింది. తొమ్మిదో గేమ్ అల్కరాస్ గేమ్ బ్రేక్ చేసిన సినర్
5-
4తో ఆధిక్యంలోకి వెళ్లాడు. తర్వాత సర్వీస్
నిలబెట్టుకుని సెట్ గెలిచి 2-1తో ఆధిక్యంలో
నిలిచాడు. నాలుగో సెట్లోనూ సినర్ జోరు ప్రదర్శించాడు. మూడో గేమ్ లో బ్రేక్ సాధించి
ఆపై 3-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అదే దూకుడుతో సెట్ తో పాటు
ట్రోఫీని కైవసం చేసుకున్నాడు.
====================
====================



0 Komentar