Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

Wimbledon Women’s Final 2025: Iga Swiatek defeats Amanda Anisimova for First Wimbledon Title – Total 6 Grand Slam Titles

 

Wimbledon Women’s Final 2025: Iga Swiatek defeats Amanda Anisimova for First Wimbledon Title – Total 6 Grand Slam Titles

వింబుల్డన్ మహిళల సింగిల్స్‌ ఫైనల్ 2025: తొలి వింబుల్డన్ టైటిల్‌ & ఆరవ గ్రాండ్ స్లామ్ గెలుచుకున్న పోలాండ్ క్రీడాకారిణి ఇగా స్వియాటెక్

==================

వింబుల్డన్ 2025 మహిళల సింగిల్స్‌ ఫైనల్ అంటే హోరాహోరీ తప్పదనుకున్నారంతా. కానీ కేవలం 57 నిమిషాల్లోనే మహిళల సింగిల్స్ ఫైనల్లో ఫలితం తేలిపోయింది. మ్యాచ్ అత్యంత ఏకపక్షంగా ముగిసిపోయింది. పోటీ లేదు.. పోరాటం లేదు. ఆటంతా ఒకరిదే. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయిన స్వైటెక్.. తొలిసారి వింబుల్డన్ ట్రోఫీని కైవసం చేసుకుంది.

ఆధిపత్యం, దూకుడు, క్లాస్ అన్ని కలబోసి అదరగొట్టేసిన ఈ పోలెండ్ స్టార్.. టైటిల్ ను  ఎగరేసుకుపోయింది. శనివారం ఏకపక్షంగా సాగిన పోరులో ఎనిమిదో సీడ్ స్వైటెక్ 6-0, 6-0తో 13వ సీడ్ అమండా అసిమోవా (అమెరికా)ను చిత్తు చిత్తుగా ఓడించింది. ఫైనల్లో ఆటంతా స్వైటెడ్డే. తొలి గేమ్ లోనే అనిసిమోవా సర్వీస్ బ్రేక్ అయిపోయింది. బలమైన సర్వీసులు, ప్లేస్మెంట్లతో చూస్తుండగానే 4-0తో ఆధిక్యంలోకి వెళ్లింది స్వైటెక్. గేమ్ గేమ్ కు దూకుడు పెంచిన ఇగా.. ప్రత్యర్థి కోలుకునే అవకాశమే ఇవ్వలేదు. 24 నిమిషాల్లోనే తొలి సెట్ ను కైవసం చేసుకుంది.

రెండో సెట్ లోనూ అనిసిమోవా కోలుకోలేకపోయింది. బలహీనమైన సర్వీసులు, అనవసర తప్పిదాలతో స్వైటెక్ మరింత చెలరేగే అవకాశాన్ని ఇచ్చింది. దీంతో 3-0తో ఆధిక్యంలోకి వెళ్లింది పోలెండ్ స్టార్. రిటర్న్ చేసే క్రమంలో పదే పదే బంతిని నెట్కు కొట్టిన అనిసిమోవా అసహనానికి గురైంది. ఒత్తిడికి గురై తప్పిదాలు చేసింది. దీంతో ఆధిక్యాన్ని 5-0కు పెంచుకున్న స్వైటెక్.. సర్వీస్ నిలబెట్టుకుని తేలిగ్గా సెట్ ను, ట్రోఫీని కైవసం చేసుకుంది. ఒక మెరుపు విన్నర్ తో ఆమె మ్యాచ్ ను ముగించింది. స్వైటెక్ 3 ఏస్లు, 10 విన్నర్లు కొట్టింది. ఆరుసార్లు అనిసిమోవా సర్వీస్ బ్రేక్ చేసింది. 5 డబుల్ ఫాల్ట్స్, 28 అనవసర తప్పిదాలు చేసిన అనిసిమోవా ఓటమిని కొనితెచ్చుకుంది.

ముఖ్యాంశాలు:  

> స్వైటెక్ నెగ్గిన గ్రాండ్ స్లామ్ సింగిల్స్ టైటిళ్లు. నాలుగుసార్లు ఫ్రెంచ్ ఓపెన్, ఒక్కోసారి వింబుల్డన్, యుఎస్ ఓపెన్ గెలిచింది.

> వింబుల్డన్ లో వరుసగా ఎనిమిదో సంవత్సరం కొత్త ఛాంపియన్ అవతరించింది.

> ఓపెన్ శకంలో ఒక గ్రాండ్ స్లామ్ ఫైనల్లో 6-0, 6-0తో గెలవడం ఇది రెండోసారి మాత్రమే. 1988 ఫ్రెంచ్ ఓపెన్ లో నటాషా జ్వెరెవాను స్టెఫీగ్రాఫ్ ఇంతే తేడాతో ఓడించింది.

> 114 ఏళ్ల తర్వాత వింబుల్డన్ టోర్నీలో మహిళల సింగిల్స్ ఫైనల్లో 6-0, 6-0తో నెగ్గడం ఇదే తొలిసారి.

> గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో ఆరుసార్లు తుదిపోరు చేరిన స్వైటెక్ అన్నిసార్లూ నెగ్గింది. ఇలా వరుసగా ఆరు ఫైనల్స్ గెలిచిన మార్గరేట్ కోర్ట్, మోనికా సెలెస్ లను చేసింది.

==================

HIGHLIGHTS

==================

Previous
Next Post »
0 Komentar

Google Tags