Amazon 'Great Indian Festival’ Sale 2025
– Dates and Offer Details Here
అమెజాన్
‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్’ సేల్ 2025 – తేదీలు మరియు ఆఫర్ ల వివరాలు ఇవే
====================
అమెజాన్ తన
వార్షిక గ్రాండ్ సేల్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2025' తేదీని ప్రకటించింది. ఈ సేల్ సెప్టెంబర్ 23 నుంచి ప్రారంభమవుతుందని సంస్థ తెలిపింది. అయితే సేల్
ఎంతకాలం కొనసాగుతుందని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. ప్రైమ్ సభ్యులకు 24 గంటలు ముందుగానే ప్రత్యేక ఆఫర్లకు యాక్సెస్ లభించనుంది.
ఇప్పటికే
అమెజాన్ తన యాప్ లాండింగ్ పేజీని అప్డేట్ చేస్తూ శాంసంగ్ స్మార్ట్ఫోన్లపై భారీ
ఆఫర్లు రాబోతున్నాయని టీజర్ విడుదల చేసింది. సేల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు, టాబ్లెట్లు, వేరబుల్స్తో పాటు అనేక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు ప్రత్యేక
రాయితీలతో అందుబాటులోకి రానున్నాయి. ముఖ్యంగా శాంసంగ్, యాపిల్, రియల్మీ, డెల్, వంటి ప్రముఖ
బ్రాండ్ల ఉత్పత్తులపై 40శాతం వరకు డిస్కౌంట్
తో భారీ ఆఫర్లు లభించనున్నాయని అమెజాన్ టీజర్లో వెల్లడించింది.
అదనంగా
ఎస్బీఐ డెబిట్, క్రెడిట్ కార్డులతో చెల్లింపులు చేసే
కస్టమర్లకు గరిష్ఠంగా 10 శాతం ఇన్స్టంట్
డిస్కౌంట్ లభించనుంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీలపై కూడా ఈ డిస్కౌంట్
వర్తించనుంది. కొనుగోలుదారులు వడ్డీరహిత ఈఎంఐ ఆప్షన్లు, ఎక్స్ఛేంజ్ బోనస్ సదుపాయాలను కూడా పొందొచ్చు.
ఎలక్ట్రానిక్స్, యాక్సెసరీస్పై హెచ్పీ, బోట్, సోనీ వంటి
బ్రాండ్లపై 80శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది.
ప్రతీ ఏడాది దసరా, దీపావళి సీజన్లో
జరిగే ఈ సేల్కు వినియోగదారుల నుంచి భారీ స్పందన లభిస్తుంది. ఈసారి కూడా
ఆకర్షణీయమైన ఆఫర్లతో అమెజాన్ పెద్ద సంఖ్యలో కస్టమర్లను ఆకట్టుకునే అవకాశం ఉంది.
====================
====================



0 Komentar