Lunar Eclipse 2025
(Sep 7): All You Need to Know About Today’s Eclipse
నేడు (సెప్టెంబర్
7) సంపూర్ణ
చంద్ర గ్రహణం – వివరాలు ఇవే
===================
సెప్టెంబర్ 7
(ఆదివారం) రాత్రి సంపూర్ణ చంద్ర గ్రహణం ఏర్పడనుంది. వాతావరణం అనుకూలిస్తే
ప్రపంచంలోని దాదాపు 85 శాతం మందికి ఇది
కనిపించనుంది. ఆసియా, పశ్చిమ
ఆస్ట్రేలియాల్లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపిస్తుంది. ఐరోపా, ఆఫ్రికా, తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లలో పాక్షికంగా కనిపించనుంది. చంద్రుడు 82 నిమిషాలపాటు పూర్తిగా భూమి నీడన ఉండనున్నాడు.
> ఆదివారం
రాత్రి 8.58 గంటలకు గ్రహణం ప్రారంభం కానుంది. 11 గంటల నుంచి 12.22 వరకు సంపూర్ణ గ్రహణం ఏర్పడుతుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటలకు గ్రహణం వీడనుంది.
> మేఘాలు
లేకుంటే దిల్లీ, ముంబయి, కోల్కతా, పుణె, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ లో సంపూర్ణ చంద్ర గ్రహణం కనిపించనుంది.
నియమాలు పాటించాలా
వద్దా?
ఆదివారం
రాత్రి ఏర్పడనున్న సాధారణ చంద్ర గ్రహణాన్ని 'రక్త చంద్ర
గ్రహణం'
(బ్లడ్ మూన్) అంటూ కొందరు సామాజిక మాధ్యమాల్లో
ప్రచారం చేస్తున్నారని, అవన్నీ వదంతులని, వాటిని నమ్మొద్దని ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా (హైదరాబాద్)
సంచాలకుడు ఎన్. శ్రీరఘునందన్ శనివారం తెలిపారు. ఈ ఏడాదిలో ఇది మూడో గ్రహణమని, దీనికి ఎలాంటి ప్రత్యేకతలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ
చంద్ర గ్రహణం దేశమంతటా అందరికీ కనిపిస్తుందని, బైనాక్యులర్స్
అవసరం లేకుండా చూడవచ్చన్నారు. చంద్ర గ్రహణం ప్రారంభమైనప్పటి నుంచి వీడేవరకూ
గర్భిణులు ఆహారం తినకూడదన్నది అపోహ మాత్రమేనని స్పేస్ మెడిసిన్ నిపుణుడు డాక్టర్
విజయ్ భాస్కర్ తెలిపారు.
===================
===================
It’s a full moon today! 🌕
— NASA (@NASA) September 7, 2025
Skywatchers in most of Africa, Europe, Asia and Australia may also see a lunar eclipse, or Blood Moon. Totality will begin around 1730 UTC and last for about 82 minutes.
No matter where you are, you can learn how eclipses work: https://t.co/qt42ek6ojZ pic.twitter.com/pxXFRnSjUE


0 Komentar