Jio Anniversary Offers: Mobile Free Data
& Plans – Details Here
జియో వార్షికోత్సవం
సందర్భం లో బంపర్ ఆఫర్లు – రీఛార్జి ప్లాన్ లు, ఫ్రీ డేటా & ఇతర వివరాలు ఇవే
===================
జియో వార్షికోత్సవం సందర్భం లో (సెప్టెంబర్ 5) కీలక ప్రకటన చేసింది. తమ వినియోగ దార్ల సంఖ్య 50 కోట్ల మార్కు దాటినట్లు తెలిపిన ఆ సంస్థ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ప్లాన్ల ఆధారంగా యూజర్లందరికీ అపరిమిత డేటాను నెలపాటు ఉచితంగా అందించనున్నట్లు తెలిపింది. రూ.349, ఆపై ప్లాన్లు ఉన్న వినియోగదారులకు సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5వరకు ఈ ఆఫర్ను అందించడంతోపాటు వార్షికోత్సవ వారాంతం ఆఫర్ ను ప్రకటించింది.
ఆఫర్ ల వివరాలు
వీకెండ్లో భాగంగా సెప్టెంబర్ 5 నుంచి 7వరకు (శుక్ర, శని, ఆదివారాలు) ప్రస్తుత ప్లాన్ తో సంబంధం లేకుండా 5జీ స్మార్ట్ఫోన్ యూజర్లందరికీ అపరిమిత 5జీ డేటాను ఉచితంగా అందజేయనున్నట్లు జియో వెల్లడించింది. 4జీ వినియోగదారులు మాత్రం రూ.39తో రీఛార్జ్ చేసుకొని ఈ వీకెండ్ లో అపరిమిత 4జీ డేటాను (రోజుకు గరిష్ఠంగా 3జీబీ) పొందవచ్చని తెలిపింది.
వార్షికోత్సవ
నెల ఆఫర్ విషయానికొస్తే.. రూ. 349 ప్లాన్ (రోజుకు 2జీబీ అంతకంటే ఎక్కువ డేటా ప్లాన్) ఉన్న వారికి సెప్టెంబర్ 5 నుంచి అక్టోబర్ 5వరకు అపరిమిత
5జీ డేటా పొందవచ్చు. వీటితోపాటు ‘జియోహోమ్’ 2నెలల ఉచిత ట్రయల్ వంటి సదుపాయాలు అందించనుంది. ఇక రూ.349 ప్లాన్ ను 12 నెలలు క్రమంగా రీఛార్జ్ చేసుకున్న వారికి మరో నెల ఉచితంగా సేవలు అందిస్తామని
వెల్లడించింది.
===================
===================




0 Komentar