NIRF Ranking 2025: IIT Madras Tops Again
in Ministry of Education’s India Rankings 2025
వరుసగా ఏడవ ఏడాది
ఉత్తమ విద్యా సంస్థ గా ఐఐటీ మద్రాస్ – NIRF ర్యాంకులను విడుదల చేసిన కేంద్ర విద్యాశాఖ
==================
NIRF 2025 ను కేంద్ర విద్యాశాఖ మంత్రి నేడు (సెప్టెంబర్ 4) ధర్మేంద్ర
ప్రదాన్ విడుదల చేశారు. ద ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ ఈ ఏడాది కూడా పలు
ర్యాంకులు సంపాదించి అగ్రస్థానంలో నిలిచింది. 'ఓవరాల్
కేటగిరీలో వరుసగా ఏడోసారి టాప్ ర్యాంక్ దక్కగా.. ఇంజినీరింగ్ విభాగంలో వరుసగా 10వ ఏడాది తొలి స్థానం సంపాదించుకున్నట్లు విద్యాసంస్థ
ప్రతినిధులు తెలిపారు.
ఆవిష్కరణల
విభాగంలో గతేడాది రెండో స్థానం రాగా.. ఇప్పుడు నంబర్ వన్ స్థానం దక్కించుకొంది. ఈ
ఏడాది కొత్తగా ప్రవేశపెట్టిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాల కేటగిరీలోనూ ఐఐటీ మద్రాస్
పైచేయి సాధించింది. 'నిరంతరం టాపర్ గా నిలవడం సమష్టి, సమన్వయ, బృంద కృషికి దక్కిన
ఫలితం. ఇంతటి అద్భుతమైన బృందం మాకు ఉండటం భగవంతుడి దయ. మేమంతా వికసిత్ భారత్ 2047 లక్ష్యసాధనకు కృషి చేస్తాం' అని ఐఐటీ మద్రాస్ ప్రొఫెసర్ వి. కామకోటి తెలిపారు.
ఓవరాల్
కేటగిరీలో టాప్ విద్యాసంస్థలు
1. ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, మద్రాస్
2. ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
3. ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, బాంబే
4.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఢిల్లీ
5. ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కాన్పూర్
6. ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఖరగుర
7. ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, రూర్కీ
8. ఆల్
ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, దిల్లీ
9. జవహర్లాల్
నెహ్రూ విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ
10. బనారస్
హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
టాప్ IO విశ్వవిద్యాలయాలు
1. ఇండియన్
ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు
2. జవహర్లాల్
నెహ్రూ శ్వవిద్యాలయం, న్యూదిల్లీ
3. మణిపాల్
అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్, మణిపాల్
4. జామియా
మిలియా ఇస్లామియా, న్యూదిల్లీ
5. దిల్లీ
విశ్వవిద్యాలయం, న్యూదిల్లీ
6. బనారస్
హిందూ విశ్వవిద్యాలయం, వారణాసి
7. బిర్లా
ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ – పిలానీ
8. అమృత
విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్
9. జాదవుర్
విశ్వవిద్యాలయం, కోల్ కతా
10. అలీగఢ్
ముస్లిం విశ్వవిద్యాలయం, అలీగఢ్
టాప్ 5 కళాశాలలు
1. హిందూ
కళాశాల, దిల్లీ
2. మిరాండా
హౌస్, దిల్లీ
3. హన్స్
రాజ్ కళాశాల, దిల్లీ
4. కిరోడి మాల్ కళాశాల, దిల్లీ
5. సెయింట్
స్టీఫెన్స్ కళాశాల, దిల్లీ
==================
CLICK FOR
UNIVERSITIES RANKINGS
==================



0 Komentar