Warning: No part of this site may be reproduced, stored in a retrieval system or transmitted in any form without the prior permission of the website owner is strictly prohibited

US Open-2025: Carlos Alcaraz beats Jannik Sinner to Claim Second US Open & Claims No1. Rank

 

US Open-2025: Carlos Alcaraz beats Jannik Sinner to Claim Second US Open & Claims No1. Rank

యుఎస్ ఓపెన్-2025: రెండో సారి యుఎస్ ఓపెన్ విజేత గా 22 ఏళ్ల కార్లోస్ – మొత్తంగా 6 గ్రాండ్ స్లామ్ ల విజేత గా  & ప్రపంచ నంబర్ 1 గా అల్కరాజ్

====================

2025 యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ టైటిల్ విజేతగా స్పెయిన్ కుర్రాడు కార్లోస్ అల్కరాస్ నిలిచాడు. హోరాహోరీగా సాగిన ఫైనల్లో యానిక్ సినర్ ను 6-2, 3-6, 6-1, 6-4 తేడాతో మట్టికరిపించాడు. ఈ విజయంతో 65 వారాలుగా ప్రపంచ నంబర్ 1 స్థానంలో ఉన్న సినర్ ను వెనక్కి నెట్టి అల్కరాస్ మళ్లీ టాప్ ర్యాంకు దక్కించుకున్నాడు.

మొత్తం 2 గంటల 42 నిమిషాల పాటు సాగిన ఫైనల్లో తొలిసెట్ ను అల్కరాస్ అలవోకగా నెగ్గాడు. రెండో సెట్లో కార్లోస్ తేలిపోయినప్పటికీ, మూడో సెట్లో విజృంభించాడు. దూకుడుగా ఆడి 6-1 తేడాతో సెట్ ను కైవసం చేసుకున్నాడు. ఇక కీలక నాలుగో సెట్లో ఇరువురు ఆటగాళ్లు హోరాహోరీగా తలపడ్డప్పటికీ అల్కరాస్ ఒత్తిడిని అధిగమించి విజేతగా అవతరించాడు.

అల్కరాస్ కు ఇది ఆరో గ్రాండ్ స్లామ్ టైటిల్ కాగా, రెండో యూఎస్ ఓపెన్. ఈ ఏడాది జరిగిన మూడు గ్రాండ్ స్లామ్  ఫైనల్స్ లో అల్కరాస్, సినర్ పోటీ పడగా.. తొలుత ఫ్రెంచ్ ఓపెన్ ను కార్లోస్ గెలుచుకోగా, వింబుల్డన్ ను సినర్ సొంతం చేసుకున్నాడు. ఈ ఏడాదిలో జరిగిన 4 గ్రాండ్ స్లామ్ లలో అల్కరాస్ & సినర్ చెరో రెండు గ్రాండ్ స్లామ్ టైటిళ్లు నెగ్గినట్లు అయింది.

====================

Previous
Next Post »
0 Komentar

Google Tags