Cyclone Montha – Heavy Rains Andhra
Pradesh Next Coming Days (October 26 to 29) – Details Here
‘మొంథా’
తుపాను – ఆంధ్రప్రదేశ్ కు తుపాను ముప్పు - అక్టోబర్
26,
27, 28, 29 తేదీల లో గాలులతో కూడిన వర్షాలు – ఇప్పటికే
కొన్ని జిల్లాలలో పాఠశాలలకి సెలవుల ప్రకటన
===================
ఆంధ్రప్రదేశ్
తుపాను ముప్పు పొంచి ఉంది. 'మొంథా' తుపాను రాష్ట్రంలో తీరం దాటే అవకాశం ఉంది. దాని వల్ల ఏపీకి
వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.
> అక్టోబర్
26,
27, 28, 29 తేదీల్లో తుపాను చాలా ప్రభావం
చూపిస్తుందని వాతావరణ కేంద్రం పేర్కొంది.
> ఈ నెల 28న సాయంత్రం కాకినాడ సమీపంలో తీవ్రమైన తుపానుగా తీరం దాటే
అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
> ఆ
సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయి. విశాఖపట్నం-తిరుపతి
వరకూ దీని ప్రభావం ఉండనుంది. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ భారీ వర్షాలు కురిసే
అవకాశం ఉంది.
> ఏపీలోని
తీర ప్రాంత జిల్లాల్లో ఉన్న విద్యా సంస్థలకు 28, 29 తేదీల్లో సెలవు ప్రకటించాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. దూర
ప్రాంతాలకు వెళ్లే వారు ప్రయాణాలు మానుకోవాలని పేర్కొన్నారు.
> భారీ
వర్షాలు కురవనుండటంతో మచిలీపట్నం, దివిసీమ, విజయవాడ, గుంటూరు, ఏలూరు, గోదావరి జిల్లా
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
తుఫాన్ సమయం లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు:
‘మొంథా’
తుఫాన్ ఎఫెక్ట్.. విద్యాసంస్థలకు సెలవులు
ఇప్పటి వరకు కొన్ని
జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు.
1. కాకినాడ
జిల్లా: 27 నుండి 31 వరకు సెలవులు
2. కృష్ణా
జిల్లా: 27, 28, 29 తేదీల్లో సెలవులు
3. బాపట్ల
జిల్లా: 27,
28, 29 తేదీల్లో సెలవులు
4. గుంటూరు జిల్లా:
27,
28, 29 తేదీల్లో సెలవులు
5. ఎన్టీఆర్ జిల్లా:
27,
28, 29 తేదీల్లో సెలవులు
6. ప్రకాశం జిల్లా:
27,
28, 29 తేదీల్లో సెలవులు
7. అనకాపల్లి
జిల్లా: 27,
28, 29 తేదీల్లో సెలవులు
8. విజయ
నగరం జిల్లా: 27, 28, 29 తేదీల్లో సెలవులు
9. మన్యం జిల్లా:
27,
28, 29 తేదీల్లో సెలవులు
10. శ్రీకాకుళం జిల్లా: 27, 28, 29 తేదీల్లో సెలవులు
11. తూర్పు
గోదావరి: 27 & 28 తేదీల్లో సెలవులు
12 అన్నమయ్య
జిల్లా: 27 & 28 తేదీల్లో సెలవులు
13. కడప జిల్లా: 27 & 28 తేదీల్లో సెలవులు
14. ఏలూరు
జిల్లా: 27 & 28 తేదీల్లో సెలవులు
15. విశాఖపట్నం
జిల్లా: 27 & 28 తేదీల్లో సెలవులు
16. పశ్చిమ
గోదావరి జిల్లా: 27 & 28 తేదీల్లో సెలవులు
17. కోనసీమ జిల్లా: 27 & 28 తేదీల్లో సెలవులు
18. పల్నాడు
జిల్లా:
19. నెల్లూరు జిల్లా: 27 & 28 తేదీల్లో సెలవులు
20. చిత్తూరు జిల్లా: 27 వ తేదీ సెలవు
===================
🔸ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) October 25, 2025
🔸గడిచిన 3 గంటల్లో గంటకు 7 కి.మీ వేగంతో కదిలిన వాయుగుండం
🔸ప్రస్తుతానికి పోర్ట్ బ్లెయిర్ కి 440 కి.మీ,విశాఖపట్నంకి 970 కి.మీ చెన్నైకి 970 కి.మీ, కాకినాడకి 990 కి.మీ, గోపాల్పూర్ కి 1040 కి.మీ. దూరంలో కేంద్రీకృతం pic.twitter.com/sQitNqF6V2



0 Komentar