CTET – Central Teacher Eligibility Test -
February 2026: All the Details Here
సెంట్రల్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) - ఫిబ్రవరి
2026:
పూర్తి వివరాలు ఇవే
===================
UPDATE 05-02-2026
CTET February
2026: అడ్మిట్ కార్డులు విడుదల
పరీక్షల తేదీలు: 07/02/2026 & 08/02/2026
===================
UPDATE 04-02-2026
CTET FEB 2026: పరీక్షల షెడ్యూల్ విడుదల
===================
UPDATE 25-01-2026
CTET Feb 2026: ప్రీ-అడ్మిట్ కార్డ్ విడుదల (పరీక్ష కేంద్రం సిటీ వివరాలు
విడుదల)
===================
UPDATE 29-12-2025
CTET Feb 2026: సీటెట్ దరఖాస్తు పూర్తికి 'వన్ టైం ఫెసిలిటీ' అవకాశం – వివరాలు ఇవే
సీబీఎస్ఈ నిర్వహించే
కేంద్రీయ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (CTET 2026)కు దరఖాస్తుల గడువు డిసెంబర్ 18తో ముగిసిన
విషయం తెలిసిందే. అయితే, ఆన్లైన్ దరఖాస్తుకు
ప్రయత్నించి పూర్తి చేయడంలో ఇబ్బందులు ఎదుర్కొన్న అభ్యర్థులకు సీబీఎస్ఈ (CBSE) బోర్డు ఉపశమనం కల్పించింది. వీరంతా తిరిగి దరఖాస్తు
చేసుకొనేందుకు వీలుగా నిర్ణయం తీసుకుంది. వెబ్సైట్ సరిగా పనిచేయకపోవడంతో తాము
దరఖాస్తులను నిర్దేశిత గడువులోగా సమర్పించలేకపోయామని, అందువల్ల దరఖాస్తులకు గడువును పొడిగించాలంటూ పలువురు
అభ్యర్థుల నుంచి బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. దీంతో సీటెట్ అప్లికేషన్
విండోని మళ్లీ అందుబాటులోకి తేవాలని అధికారులు నిర్ణయించారు.
ఈ తాజా
నిర్ణయం ప్రకారం.. 'వన్ టైం ఫెసిలిటీ' కింద డిసెంబర్ 27న ఉదయం 11గంటల నుంచి డిసెంబర్ 30న రాత్రి 11.59గంటల వరకు ఈ అప్లికేషన్ విండోని అందుబాటులో ఉంచనున్నారు.
రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించి దాన్ని పూర్తిగా సమర్పించలేని అభ్యర్థులకు
మాత్రమే ఈ అవకాశం కల్పిస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అంతేగానీ, కొత్తగా దరఖాస్తు చేసుకొనేందుకు మాత్రం అనుమతి లేదని
తెలిపారు. దరఖాస్తు చేసే అభ్యర్థులు తమ వివరాలను జాగ్రత్తగా ధ్రువీకరించుకోవాలని, పొరపాట్ల సవరణకు వీరికి అవకాశం ఉండదని తేల్చి చెప్పారు.
===================
ప్రతీ ఏటా
సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ
పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్వహిస్తోంది
తాజాగా ఫిబ్రవరి 2026 సంబంధించిన పత్రికా ప్రకటన
విడుదలైంది.
సెంట్రల్
టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) ఫిబ్రవరి 2026
పరీక్ష
విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్ ఒకటి నుంచి ఐదు
తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్
ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్
స్కోర్ లైఫ్ లాంగ్ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్ స్కోర్ కేంద్ర ప్రభుత్వం
పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు.
అర్హతలు:
పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా (డీఈఎల్ఈడీ) / డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (ప్రత్యేక
విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై
ఉండాలి.
పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్
ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ / బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ (బీఈడీ) / బీఈడీ (ప్రత్యేక
విద్య) లేదా సీనియర్ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ
ఎడ్యుకేషన్(బీఈఎల్ ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.
దరఖాస్తు
రుసుము: జనరల్ / ఓబీసీ కేటగిరీలకు రూ.1000 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200 (పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/
దివ్యాంగులకు: రూ.500 (పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600 (పేపర్ 1 & 2 రెండూ).
ముఖ్యమైన
తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27-11-2025
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 18-12-2025
పరీక్ష తేదీ: 08-02-2026
===================
===================


0 Komentar