AP Village/Ward Secretariats – Inter District Transfers on Spouse
Grounds – Guidelines – G.O. Releaesd
గ్రామ, వార్డు సచివాలయాల్లో అంతర్ జిల్లా బదిలీల మార్గదర్శకాల తో కూడిన
ప్రభుత్వ ఉత్తర్వులు విడుదల
=====================
Department of GSWS – Village/Ward
Secretariats – Functionaries – Inter District Transfers on spouse Grounds –
Guidelines - Orders – Issued.
DEPARTMENT OF GRAMA SACHIVALAYAMS AND
WARD SACHIVALAYAMS
G.O.MS.No. 15, Dated: 17-11-2025
Read the following: -
1.G.O.Ms.No.01 GSWS Department, dated
25.01.2025.
2.G.O.Ms.No.03 GSWS Department, dated
10.04.2025.
3.G.O.Ms.No.04 GSWS Department, dated
17.05.2025.
4.G.O.Ms.No.23, Finance (HR.I-PLG& Policy)
Dept.,dt.15.05.2025.
5.G.O.Ms.No.05, GSWS Department,
dt.12.06.2025.
6.From the Director, GSWS, Vijayawada, E-file
Computer No.2999478
=====================
గ్రామ, వార్డు సచివాలయాల్లో అంతర్ జిల్లా బదిలీలకు ప్రభుత్వం ఆమోదం
తెలిపింది. భార్య/భర్త ఆధారంగా స్పౌజ్ కోటా కింద ఉద్యోగులకు స్థానచలనం
కల్పించనుంది. బదిలీల ప్రక్రియను ఈ నెల 30 నాటికి పూర్తి చేయాలని అధికారులను
ఆదేశించింది. కోరుకున్న స్థానంలో ఖాళీలు ఉంటేనే బదిలీ వర్తించనుంది. ఈ మేరకు
రాష్ట్ర గ్రామ, వార్డు సచివాలయాలశాఖ సోమవారం
ఉత్తర్వులు జారీ చేసింది. ఒకట్రెండు రోజుల్లో బదిలీల షెడ్యూల్ విడుదల చేయనుంది.
మార్గదర్శకాలు
ఇవే:
> అభ్యర్థన
ఆధారంగా పరిశీలన.
> ఆన్లైన్లోనే
దరఖాస్తు చేయాలి.
> జిల్లా
అధికారులు ఖాళీల వివరాలు స్పష్టంగా ప్రకటించాలి.
> ఖాళీలు
ప్రకటించడం ద్వారా ఉద్యోగులు తమకు కావాల్సిన మండలాలు, మున్సిపాలిటీలు ఎంపిక చేసుకునే వీలుంటుంది.
> ఏసీబీ, విజిలెన్స్ కేసులు పెండింగ్లో ఉన్న ఉద్యోగులు అనర్హులు.
> ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ల నుంచి ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలూ
లేనట్లుగా ధ్రువీకరణపత్రం తప్పనిసరి.
> దరఖాస్తులపైనా
అధికారులిద్దరి ధ్రువీకరణతోనే ఆన్లైన్లో అప్లోడ్ చేయాలి.
> దరఖాస్తుల
పరిశీలన తరవాత ప్రొవిజినల్ సీనియారిటీ జాబితాను పోర్టల్లో పెడతారు. అభ్యంతరాలు
పోర్టల్లో అప్లోడ్ చేయాలి.
> పరిశీలన
అనంతరం సీనియారిటీ ఫైనల్ జాబితా ప్రకటిస్తారు.
అర్హత వివరాలు:
> భార్యాభర్తలు
ప్రభుత్వ శాఖలు, ప్రభుత్వ రంగ సంస్థలు, విశ్వవిద్యాలయాలు, కేంద్ర
ప్రభుత్వ సంస్థల్లో పని చేస్తున్న వారికే బదిలీ వర్తిస్తుంది.
> ఒకరు
ప్రభుత్వ,
మరొకరు ప్రైవేట్ సంస్థల్లో పని చేస్తున్నట్లయితే వర్తించదు.
> వివాహ
ధ్రువీకరణ, ఉద్యోగ గుర్తింపు పత్రం (ఐడీ కార్డు)
తప్పనిసరి.
> ఖాళీలు
ఉన్నపుడే బదిలీ చేస్తారు.
> మెరిట్
ర్యాంక్ ఆధారంగా క్రమపద్ధతి పాటిస్తారు.
> టై అయిన
చోట సీనియారిటీ, పుట్టిన తేదీ ఆధారంగా బదిలీల్లో
ప్రాధాన్యం ఇస్తారు.
=====================
=====================


0 Komentar