Cricket Records: Bihar
Scores Highest Total in List A (50 Overs) Match with Score
574
క్రికెట్
రికార్డులు: 574 పరుగుల స్కోరుతో లిస్ట్ ఎ (50 ఓవర్ల) మ్యాచ్‌లో అత్యధిక స్కోరును నమోదు చేసిన బీహార్
===================
విజయ్ హజారే
ట్రోఫీలో భాగంగా బిహార్, అరుణాచల్ ప్రదేశ్
రాంచీ వేదికగా జరిగిన మ్యాచ్ లో బిహార్ 397 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ గెలిచిన బిహార్ తొలుత బ్యాటింగ్
ఎంచుకుని,
నిర్ణీత 50 ఓవర్లలో రికార్డు
స్థాయిలో 6 వికెట్ల నష్టానికి 574 పరుగులు చేసింది. ఇది విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే మరియు
లిస్ట్ A (50 ఓవర్ ల) మ్యాచ్ లలో అత్యధిక స్కోర్.
ఇంతకుముందు విజయ్
హజారే ట్రోఫీ లో ఆ రికార్డ్ తమిళనాడు పేరిట ఉంది. ఆ జట్టు 21 నవంబర్ 2022లో అరుణాచల్ ప్రదేశ్
మీద నిర్ణీత 50 ఓవర్లలో 2 వికెట్లు నష్టపోయి 506 పరుగులు చేసింది. ప్రస్తుతం ఆ రికార్డ్ ను బిహార్ బ్రేక్ చేసింది. రెండు
సందర్భాల్లోనూ ప్రత్యర్థి జట్టు అరుణాచల్ ప్రదేశ్ కావడం గమనార్హం. అనంతరం
బ్యాటింగ్ కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ జట్టు 42.1 ఓవర్లలో 177 పరుగులకు కుప్పకూలింది. వన్డే చరిత్ర
లో ఇంగ్లండ్ జట్టు 50 ఓవర్ లలో చేసిన 498 పరుగులు ఇప్పటికీ అత్యధికం.
VAIBHAV SURYAVANSHI’S RECORD BREAKING 190 (84) IN THE VIJAY HAZARE TROPHY. 🔥pic.twitter.com/QZs5SyOHWR
— Mufaddal Vohra (@mufaddal_vohra) December 24, 2025
బిహార్
బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) (190; 84 బంతుల్లో, 16 ఫోర్లు, 15 సిక్స్లు), ఆయుష్ లోహరుక (116, 56 బంతుల్లో, 11 ఫోర్లు, 8 సిక్స్లు), సకిబుల్ ని (128*;40 బంతుల్లో, 10 ఫోర్లు, 12 సిక్స్లు) సెంచరీలతో చెలరేగిపోయారు. పీయూష్ సింగ్ (77; 66 పరుగులు, 7 ఫోర్లు, 2 సిక్స్లు) హాఫ్ సెంచరీ సాధించాడు. దీంతో బిహార్ జట్టు భారీ
స్కోర్ చేయగలిగింది. బిహార్ బ్యాటర్లలో వైభవ్ సూర్యవంశీ 36 బంతుల్లో సెంచరీ చేస్తే, సకిబుల్ గని 32 బంతుల్లోనే శతకం బాదాడు. అరుణాచల్ ప్రదేశ్ బౌలర్లలో తడకమల్ల
మోహిత్,
టెక్కీ నేరి తలో రెండు, ధీరజ్ ఒక
వికెట్ తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన అరుణాచల్ ప్రదేశ్ బ్యాటర్లు
విఫలమయ్యారు. కాల్షా యాంగ్ఫో (32) టాప్ స్కోరర్ గా
నిలిచాడు. బిహార్ బౌలర్లలో ఆకాశ్ రాజ్, సూరజ్ కశ్యప్
తలో 3,
హిమాన్షు తివారీ 2, సబీర్ ఖాన్ 1 వికెట్
తీసుకున్నారు.
===================
HIGHEST TEAM SCORE RECORDS PAGE
===================


0 Komentar